వల్లభనేని వంశీకి షాకిచ్చిన విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు.. అరెస్టు వారెంట్ జారీ

2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రసాదంపాడులోని ఓ పోలింగ్ బూత్ వద్ద జరిగిన ఘటనలో మొత్తం 38 మందిపై పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు.

Vallabhaneni Vamsi

MLA Vallabhaneni Vamsi : గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ ప్రతినిధుల కోర్టు షాకిచ్చింది. గతంలో ప్రసాదంపాడులో జరిగిన ఓ ఘటనపై కేసు నమోదైంది. అయితే, ఆ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని కోర్టు పలుసార్లు వంశీకి నోటీసులు అందించినా రాకపోవటంతో తాజాగా.. వంశీకి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రసాదంపాడులోని ఓ పోలింగ్ బూత్ వద్ద జరిగిన ఘటనలో మొత్తం 38 మందిపై పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు. కేసు విచారణకు కోర్టుకు హాజరుకాకపోవటంతో వారెంట్ ను గత విచారణలోనే న్యాయస్థానం జారీ చేసింది. ఇవాళ్టి విచారణకూ వంశీ హాజరుకాకపోవటంతో వారెంట్ అమలు చేయాలని పోలీసులకు ఆదేశాలించింది. ప్రస్తుతం వల్లభనేని వంశీ నియోజకవర్గంలో అందుబాటులో లేనట్లుగా తెలుస్తోంది. గతకొంతకాలంగా ఆయన నియోజకవర్గానికి దూరంగా హైదరాబాద్ లో ఉంటున్నారని సమాచారం. అయితే, తాజా పరిణామాలపై వల్లభనేని వంశీ ఎలా ముందుకెళ్తారనేది వేచి చూడాల్సిందే.

Also Read : ప్రకాశం జిల్లా వైసీపీలో ప్లెక్సీల వార్.. మరోసారి అలిగి హైదరాబాద్ వెళ్లిపోయిన బాలినేని