Vijayawada-Somnath Special Train: విజయవాడ టూ సోమనాథ్ స్పెషల్ ట్రైన్.. 1,060 మంది భక్తులకు ఉచిత యాత్ర.. జెండా ఊపిన బొండా ఉమా
'సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్' పేరుతో విజయవాడ రైల్వే స్టేషన్ (Vijayawada-Somnath Special Train)నుంచి గుజరాత్‌లోని వేరావల్ కు ప్రత్యేక రైలు యాత్ర వైభవంగా ప్రారంభమైంది.
- V Santhosh Kumar
- Published on- October 4, 2026 / 05:51 PM IST
vijayawada to somnath swabhiman parv special train yatra started from andhra pradesh
Vijayawada-Somnath Special Train: భారతీయ సనాతన ధర్మానికి, సాంస్కృతిక వారసత్వానికి అత్యంత పవిత్ర ప్రతీకగా నిలిచే శ్రీ సోమనాథ్ జ్యోతిర్లింగ దేవాలయం పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చారిత్రాత్మక వేడుకలను నిర్వహిస్తున్నాయి. ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్’ పేరుతో తలపెట్టిన ఈ ప్రత్యేక వేడుకల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ దేవదాయ, భాషా-సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి గుజరాత్‌లోని వేరావల్ కు ప్రత్యేక రైలు యాత్ర అత్యంత వైభవంగా ప్రారంభమైంది.
Kavitha: ఈ పరిస్థితి చూస్తుంటే బాధగా ఉంది.. కాంగ్రెస్ పాలనపై కవిత ఆగ్రహం!
18 బోగీలతో ప్రత్యేక రైలు.. జెండా ఊపి ప్రారంభించిన బొండా ఉమా:
విజయవాడ(Vijayawada-Somnath Special Train) రైల్వే స్టేషన్ నుంచి 18 బోగీలతో కూడిన ఈ ప్రత్యేక ఎఫ్‌టీఆర్ రైలును ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, దేవదాయ శాఖ కమిషనర్ కే. రామచంద్ర మోహన్ జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తిరుమల, శ్రీశైలం, ఇంద్రకీలాద్రి, సింహాచలం వంటి 21 ప్రముఖ దేవాలయాల నుంచి ఎంపిక చేసిన 1,060 మంది భక్తులకు ప్రభుత్వం ఉచితంగా దర్శన అవకాశం కల్పించింది. వీరితో పాటు తెలుగు కళారూపాలను ప్రదర్శించేందుకు 100 మంది సాంస్కృతిక కళాకారులు కూడా ఈ యాత్రలో పాలుపంచుకుంటున్నారు.
భక్తులకు ఉచిత వసతి, వైద్యం.. ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాట్లు:
రైలులో ప్రయాణిస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భోజనం, తాగునీరు, వైద్య సదుపాయాలు సమకూర్చారు. ప్రతీ 22 మంది భక్తులకు ఒక గ్రూప్ లీడర్‌ను, ప్రతి బోగీకి ప్రత్యేక పర్యవేక్షకుడిని నియమించారు. గుజరాత్‌లో రెండు రోజుల పాటు వసతి, స్థానిక రవాణా ఏర్పాట్లను అక్కడి ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో జాతి సమగ్రతను, సాంస్కృతిక వైభవాన్ని చాటే ఈ దివ్య యాత్రలో పాల్గొనడం తమ పూర్వజన్మ సుకృతమని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
