Oil Business Cheat
Oil Business Cheat : విశాఖ జిల్లా పెందుర్తిలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. వంట నూనె వ్యాపారంలో భాగస్వామ్యం కల్పిస్తామంటూ వ్యాపారి రాధాక్రిష్ణ భారీ మోసానికి పాల్పడ్డాడు. 16మంది నుంచి కోటి రూపాయలు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి రూ.2లక్షల నుంచి రూ.10లక్షల వరకు వసూలు చేశాడని చెబుతున్నారు.
ఎంతకీ ఆయిల్ బిజినెస్ లో పార్టనర్ షిప్ కల్పించకపోవడంతో బాధితులు రాధాక్రిష్ణను నిలదీశారు. దీంతో డబ్బులు తిరిగి వెనక్కి ఇస్తానని మాట ఇచ్చాడు. ఆ తర్వాత అదను చూసి ఉడాయించాడు. విషయం తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. రాధాక్రిష్ణ అతడి కుటుంబసభ్యుల కోసం పెందుర్తి పోలీసులు గాలిస్తున్నారు.