Vizag Steel plant: మరోసారి స్టీల్ ప్లాంట్ లో మోగనున్న సమ్మె సైరన్

కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మార్చి 28, 29 తేదీల్లో స్టీల్ ప్లాంట్ కార్మికులు మరోసారి సమ్మెకు దిగుతున్నారు

Vizag Steel plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మరింత రసవత్తరంగా మారింది. స్టీల్ ప్లాంట్ విలువ లెక్క గట్టడానికి కేంద్ర ఆర్థికశాఖ “రెక్వెస్ట్ ఫర్ ప్రపోజల్” బిడ్లను ఆహ్వానించింది. ఈమేరకు శుక్రవారం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఓ వైపు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ, ఇతర కార్మికసంఘాలు పోరాటం చేస్తుండగానే మరోవైపు కేంద్ర ప్రభుత్వం తనపని తాను చేసుకుపోవడంపై మరింత ఆందోళన వ్యక్తం అవుతుంది. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా స్టీల్ ప్లాంట్ కార్మికులు మరోసారి సమ్మెకు దిగుతున్నట్లు తెలుస్తుంది. ఈమేరకు అఖిలపక్ష కార్మిక నాయకులు స్టీల్ ప్లాంట్ యజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే ఉంచాలని, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మార్చి 28, 29 తేదీల్లో సమ్మెకు దిగనున్నట్లు ప్రకటించారు.

Also read: BJP New Target: తెలుగు రాష్ట్రాలపై కమలం గురి..!

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకర్ణను వ్యతిరేకిస్తూ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో 400 రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. కేంద్రం స్టీల్ ఫ్లాంట్ జోలికొస్తే సహించేది లేదని ఐక్య ఉద్యమాలతో సంస్థను కాపాడుకుంటామని కార్మిక సంఘ నేతలు హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ ఆస్తుల విలువ లెక్క గట్టడానికి రెక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ పేరిట దీపం సంస్థ ఆధ్వర్యంలో కేంద్ర ఆర్థికశాఖ బిడ్లకు ఆహ్వానించింది. ఆప్రకారం ఆసక్తి ఉన్న అస్సెట్ మానేజ్మెంట్ సంస్థలు ఏప్రిల్ 4లోగ బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఏప్రిల్ 5న బిడ్లు తెరవనున్నారు. ఎంపికైన సంస్థలు.. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ మరియు దాని అనుబంధ సంస్థల ఆస్తుల లెక్కించాల్సి ఉంటుంది.

Also read: AP Cancer Hospitals : ఏపీలో మూడు క్యాన్సర్ ఆసుపత్రులు.. అతి తక్కువ ధరకే చికిత్స

ట్రెండింగ్ వార్తలు