Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సమ్మె సైరన్

విశాఖ స్టీల్ ప్లాంట్ లో సమ్మె సైరన్ మోగింది. అఖిలపక్ష కార్మిక సంఘాలు ఈ నెల 29న సమ్మెకి పిలుపునిచ్చాయి. సమ్మెకి

Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ లో సమ్మె సైరన్ మోగింది. అఖిలపక్ష కార్మిక సంఘాలు ఈ నెల 29న సమ్మెకి పిలుపునిచ్చాయి. సమ్మెకి దిగుతున్నట్టు యాజమాన్యానికి నోటీసు అందచేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గాలని డిమాండ్ చేస్తూ సమ్మెకి పిలుపునిచ్చారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మిక సంఘాల, ఉద్యోగులు పోరాటాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కార్మిక సంఘాల ఆందోళనలు ఇవాళ్టికి 124వ రోజుకు చేరాయి. ఇవాళ కార్మిక సంఘాలు సమావేశమై యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నాయి.

స్టీల్ ప్లాంట్ లోని కార్మిక సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడి యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చాయి. కార్మిక చట్టాల మేరకు సమ్మె చేయడానికి 15 రోజుల ముందుగా సమ్మె నోటీసు ఇవ్వాలి. అందుకే ఇవాళ సమ్మె నోటీసును అందించాయి. కరోనా కేసులు కొంత తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో మరోసారి ఆందోళనలను ఉధృతం చేయాలని కార్మికులు భావిస్తున్నారు. కాగా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించొద్దని ఏపీ సీఎం జగన్ ఇటీవల ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ను కోరారు.

ట్రెండింగ్ వార్తలు