×
Ad

Washing Machine Blast: వామ్మో.. పెద్ద శబ్దంతో.. పేలిపోయిన వాషింగ్ మెషిన్.. అసలేం జరిగింది..

భారీగా శబ్ధం రావడంతో ఇంట్లోని వారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Washing Machine Blast: హైదరాబాద్ అమీర్ పేట్ లోని ఓ ఇంట్లో వాషింగ్ మెషిన్ పేలిపోయింది. వాషింగ్ మెషీన్ రన్నింగ్ లో ఉండగానే.. భారీ శబ్దంతో పేలింది. పేలుడు ధాటికి వాషింగ్ మెషిన్ తునాతునకలు అయిపోయింది. భారీగా శబ్ధం రావడంతో ఇంట్లోని వారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే, వాషింగ్ మెషిన్ దగ్గర ఎవరూ లేకపోవడంతో పెను ముప్పు తప్పింది.

ఆ వాషింగ్ మెషిన్ ను బాల్కనీలో ఉంచారు. అందులో బట్టలు వేశారు. అది రన్ అవుతోంది. ఆ సమయంలోనే ఒక్కసారిగా అది బ్లాస్ట్ అయ్యింది. లక్కీగా వాషింగ్ మెషిన్ బాల్కనీలో ఉండటంతో తమకు పెద్ద ప్రమాదం తప్పిందని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ పేలుడు శబ్దానికి వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వాషింగ్ మెషిన్ ముక్కలు ఎగిరిపడ్డాయి. దుస్తులు అందులోనే ఇరుక్కుపోయాయి. ఇది ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్.

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో వాషింగ్ మెషిన్లు వాడుతున్నారు. ప్రతి ఇంట్లో ఉండాల్సిన నిత్యవసరంగా మారింది. సాధారణంగా వాషింగ్ మెషిన్లు పేలవు. ఎక్కడా ఇలాంటి ఘటనలు జరిగింది. ఇప్పుడు అమీర్ పేట్ లో ఓ ఇంట్లో పెద్ద శబ్దంతో వాషింగ్ మెషిన్ పేలిన ఘటన అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనతో ఆ ఇంట్లోని వారే కాదు స్థానికులు సైతం భయాందోళనకు గురయ్యారు. కాగా, లోడ్ ఎక్కువైనా, నిర్వహణ లోపాలు ఉన్నా వాషింగ్ మెషిన్ బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. ఇక ఎలక్ట్రికల్, తయారీ లోపాలు ఉన్నా ఇలా బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉందన్నారు.

Also Read: కొత్త లేబర్ చట్టాలు.. మీ జీతం ఎంత కట్ అవుతుంది? చేతికి ఎంత వస్తుంది? చెక్ చేసుకోండి..