మనం ఆ రూట్‌లో వెళ్లొద్దు..బాబు మార్క్‌ మాట..!

చంద్రబాబును జైలుకు పంపిస్తే వైసీపీకి జరిగిన నష్టమేంటో..ప్రజలకు తెలుసు. ఇప్పుడు తాను అదే రూట్‌లో వెళ్తే..వాళ్లను తనకు తేడా ఏంటని..ఆ తప్పులు తాను చేయాలనుకోవడం లేదంటున్నారట బాబు.

CM Chandrababu Naidu,

ప్రజలు అధికారం కట్టబెట్టింది ప్రతీకారం తీర్చుకునేందుకు. మంచి చేయడానికి. జగన్‌నే జైలు వేస్తామంటే ఎలా. దేనికైనా ఓ పద్దతి ఉంటుంది. తప్పుచేసినవాళ్లు కేసులు ఫేస్‌ చేయక తప్పదు. అలా అనీ రాజకీయ కక్ష సాధింపులు ఉండవు. ఈ మాటలు ఎవరివో కావు ఏపీ సీఎం చంద్రబాబు క్యాబినెట్‌ మీటింగ్‌లో మంత్రులతో చెప్పిన కామెంట్స్‌. తుని ఘటన కేసుపై అప్పీల్‌కు వెళ్లే విషయంలో హోంశాఖ జీవో ఇవ్వడంపై ఓ రేంజ్‌లో ఫైరయ్యారు సీఎం చంద్రబాబు.

సీఎంవోకు చెప్పుకుండా డెసిషన్ తీసుకోవడం ఏంటని అధికారుల మీద సీరియస్‌ అయ్యారు. దీంతో అపోజిషన్‌కు అవకాశం లేకుండా చేశారు. అంతేకాదు కూట‌మి ప్రభుత్వం రాజ‌కీయ క‌క్ష సాధింపుల‌కు దిగ‌బోద‌ని క్లియర్‌కట్‌గా చెప్పేశారు. పలువురు మంత్రులు వైసీపీ హ‌యాంలో టీడీపీ నేతల అరెస్టులను ప్రస్తావించి..మనోళ్లను ఇబ్బందిపెట్టిన ఫ్యాన్‌ పార్టీ లీడర్లపై చ‌ర్యలు తీసుకోవాల‌ని కోరారట.

అయితే నేరం చేసిన వారిని వ‌దిలిపెట్టేది లేద‌న్నారట బాబు. కానీ గ‌తంలో వారేదో చేశార‌ని..ఇప్పుడు మ‌నం కూడా అదే విధంగా చేస్తామంటే కుద‌ర‌ద‌ని కూడా తేల్చి చెప్పారట. మ‌న‌వాళ్లను ఇబ్బంది పెట్టారు. నన్ను జైల్లో ఉంచారు. అవ‌న్నీ క‌క్ష సాధింపు చ‌ర్యలేన‌ని కూడా తనకు తెలుసు..అలా అని అలాంటి వారిపై చ‌ర్యలు తీసుకోలేనని క్లారిటీగా చెప్పేశారట. దీనికి కార‌ణం..రాజ‌కీయ క‌క్ష సాధింపుల‌కు దిగేందుకు ప్రజ‌లు మ‌న‌కు అధికారం ఇవ్వలేదంటూ మంత్రులకు తేల్చి చెప్పారట చంద్రబాబు.

థర్టీ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌ క్లియర్‌ కట్‌గా..
ఈ సారి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నిర్ణయాల్లో థర్టీ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌ క్లియర్‌ కట్‌గా కనిపిస్తుందంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. బాబు మార్క్ స్ట్రాటజీ పక్కాగా కనిపిస్తోందని..పబ్లిక్‌ మూడ్‌కు తగ్గట్లుగా ఆయన నిర్ణయాలు ఉంటున్నాయని చెబుతున్నారు. గత ఐదేళ్లలో ఓవరాక్షన్‌ చేసిన వైసీపీ నేతల్లో చాలా మంది అరెస్టులు అయ్యారు.

కానీ వారి విషయంలో కూటమి ప్రభుత్వం అత్యుత్సాహం చూపించ లేదన్న టాక్ వినిపిస్తోంది. తప్పు చేసినట్లు ఆధారాలు ఉంటే తప్ప తొందరపడి ఎవరిని అరెస్టులు చేయడం లేదంటున్నారు. పనిగట్టుకుని టార్గెట్ చేయడం, ప్రభుత్వాన్ని విమర్శించిన వాళ్లను ఇబ్బందిపెట్టాలనే ధోరణి చంద్రబాబులో కనిపించడం లేదంటున్నారు ఎనలిస్టులు. ఓ పద్దతి ప్రకారం విమర్శించేవాళ్ల జోళికి కూటమి ప్రభుత్వం వెళ్లడం లేదని..నోరు జారి ఇష్టం వచ్చినట్లు మాట్లాడినవాళ్లే ఇబ్బందుల పాలు అవుతున్నారని గుర్తు చేస్తున్నారు.
అడ్డగోలుగా అరెస్టులు చేసుకుంటూ పోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావిస్తున్నారట చంద్రబాబు. తనను జైల్‌లో పెట్టారని జగన్‌ కూడా జైల్‌కు పంపించాలనుకోవడం కరెక్ట్ కాదని బాబు అనడం కూడా ఓ స్ట్రాటజీ అంటున్నారు.

చంద్రబాబును జైలుకు పంపిస్తే వైసీపీకి జరిగిన నష్టమేంటో..ప్రజలకు తెలుసు. ఇప్పుడు తాను అదే రూట్‌లో వెళ్తే..వాళ్లను తనకు తేడా ఏంటని..ఆ తప్పులు తాను చేయాలనుకోవడం లేదంటున్నారట బాబు. ఎడాపెడా అరెస్టులు చేసుకుంటూ పోతే సింపతీ వేవ్‌ వస్తే తట్టుకోవడం కష్టమని జాగ్రత్త పడుతున్నారట. అలా అని ఆధారాలు ఉన్న ప్రతీ కేసులో ఎంత పెద్ద నేతలున్నా వదలొద్దని ఫిక్స్ అయ్యారట చంద్రబాబు. అయితే జగన్ కోటరీనే కూటమి ప్రభుత్వం టార్గెట్‌ చేసినట్లు కనిపిస్తుందంటున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పుడు సీఎంగా ఉన్న జగన్‌ తీసుకున్న నిర్ణయాలు, దాంతో ఏపీకి జరిగిన నష్టాన్ని మాత్రం ఎక్స్‌పోజ్‌ చేస్తూనే ఉంటారట. ఇలా పబ్లిక్ మూడ్‌కు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడంలో బాబు తర్వాతే ఎవరైనా అనుకుంటున్నారట సొంత పార్టీ నేతలు.