Weather Update : గుడ్‌న్యూస్.. మే నెలలోనే వచ్చేస్తున్నాయ్.. ఈసారి ముందుగానే నైరుతి రుతుపవనాలు..
Weather Update : నైరుతి రుతుపవనాలు ఈసారి ముందుగానే వచ్చే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
- Harish Thanniru
- Updated on- May 2, 2026 / 07:48 AM IST
Southwest Monsoon
- గుడ్‌న్యూస్ చెప్పిన ఐఎండీ
- ఈసారి ముందుగానే నైరుతి రుతుపవనాలు
- మే 14 -16 తేదీల్లో అండమాన్ నికోబార్ దీవులను తాకే అవకాశం
Weather Update : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వేసవి ఎండలు మండిపోతున్నాయి. రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో అత్యధికంగా 45డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఎండ తీవ్రతకు బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్న పరిస్థితులు. అయితే, ప్రస్తుతం మే నెలలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుభవార్త చెప్పింది.
Also Read : Rain Alert : ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో రెండు రోజులు భారీ వర్షాలు.. ఈదురుగాలులతో.. హెచ్చరికలు జారీ..
నైరుతి రుతుపవనాలు ఈసారి ముందుగానే వచ్చే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఈనెల 14 నుంచి 16 తేదీల మధ్య ఇవి అండమాన్ నికోబార్ దీవులను తాకొచ్చని పేర్కొంది. ఆ తరువాత కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల గుండా దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు పేర్కొంది.
ఇది సాధారణ సమయం కంటే కొంచెం ముందే కావడం గమనార్హం. దీంతో మేలో దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో మే నెలలో చివరి రెండు వారాల్లో ఎండల తీవ్రత తగ్గే అవకాశం ఉంది.
నైరుతి రుతుపవనాల కారణంగా దక్షిణ రాష్ట్రాలు, పశ్చిమ భారతంలో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈశాన్య రాష్ట్రాలు, తూర్ప మధ్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది. అయితే, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో పగటిపూట మాత్రమే కాదు.. రాత్రి సమయాల్లోనూ వేడి ఎక్కువగా ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. సముద్రపు తేమతో కూడిన వేడిగాలి వల్ల ఎక్కువ ఉక్కపోత ఉండొచ్చని తెలిపింది.
