Gold Shops Raid: బంగారం దుకాణాలపై అధికారుల దాడులు

కొందరు షాపు యజమానులు బంగారం తూకంలో మోసాలకు పాల్పడుతున్నట్లు వినియోగదారుల నుంచి కంప్లయింట్స్ వచ్చాయి.

Gold

Gold Shops Raid: అక్షయ తృతీయ సందర్భంగా మంగళవారం నాడు బంగారంకొనుగోలు చేసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో బంగారం దుకాణాలకు పోటెత్తారు. వినియోగదారులను ఆకర్శించేందుకు దుకాణదారులు సైతం భారీగా ఆఫర్లు ప్రకటిస్తున్నారు. అయితే కొందరు దుకాణదారులు ఆఫర్ల మాటున వినియోగదారులను మోసం చేస్తున్నారు. విజయవాడ నగరంలో అక్షయ తృతీయ సందర్భంగా మంగళవారం బంగారం దుకాణాలు కిటకిటలాడాయి. జ్యువెల్లరీ షాపు యజమానులు సైతం వినియోగదారుల సెంటిమెంట్ ను క్యాష్ చేసుకుంటున్నారు. ఈక్రమంలో కొందరు షాపు యజమానులు బంగారం తూకంలో మోసాలకు పాల్పడుతున్నట్లు వినియోగదారుల నుంచి కంప్లయింట్స్ వచ్చాయి.

Also Read:Kid distribute water: మండుటెండలో వీధి వ్యాపారులకు మంచి నీరు అందిస్తున్న బుడతడు: నెటిజన్లు ఫిదా

దీంతో రంగంలోకి దిగిన విజయవాడ తూనికలు కొలతలశాఖ అధికారులు బంగారం దుకాణాలపై దాడులు నిర్వహించారు. కొన్ని దుకాణాల్లో 1 ఎంజీ తూకంపై అనుమనాలు వ్యక్తం అయ్యాయి. పూర్తి విచారణ అనంతరం షాపు యజమానులపై చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. వినియోగదారులు సైతం బంగారం కొనుగోలు సమయంలో జాగ్రత్తగా ఉండాలని, రాయి ఉన్న బంగారు నగల విషయంలోఆచితూచి కొనుగోలు చేయాలనీ అధికారులు సూచిస్తున్నారు. బంగారం షాపుల్లో వెయింగ్ మెషిన్ కి సంబంధించి తూనికలు కొలతల సర్టిఫికేట్ లేకపోతే నేరమే అవుతుందని అధికారులు పేర్కొన్నారు.

Also read:Power Crisis: విద్యుత్ సంక్షోభం మ‌రింత తీవ్ర‌త‌రం