శ్వేత పత్రం విడుదల చేసి మరిన్ని సంచలన విషయాలు తెలిపిన చంద్రబాబు

విశాఖలోని రామానాయుడు స్టూడియోలో అనధికారికంగా ఇళ్ల పట్టాలు ఇచ్చారని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఇవాళ అటవీ, భూమి, గనుల, సహజ వనరులపై శ్వేత పత్రం విడుదల చేశారు. వైసీపీ సర్కారు పాలనలో వాటన్నిటిపై దోపిడీ జరిగిందన్నారు. రికార్డుల్లో అన్ని దొరకలేదని తెలిపారు. క్షేత్ర స్థాయిలో మరింత లోతుగా తవ్వాల్సి ఉంటుందని, అప్పుడే ఈ దోపిడీ ఎంత జరిగిందో చెప్పలగమని చెప్పారు.

వైసీపీ హయాంలో భారీగా భూ కబ్జాలు జరిగాయని చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖతో పాటు ఒంగోలు, తిరుపతి, చిత్తూరుల్లో చోటుచేసుకున్న భూ దోపిడీలు ఓ ఉదాహరణ మాత్రమేనని చెప్పారు. ఇళ్ల పట్టాల పేరిట భారీ స్థాయిలో దోపిడీ జరిగిందని తెలిపారు. అక్రమంగా పార్టీ కార్యాలయాల కోసం భూమి దోచేశారని అన్నారు. అనర్హులకు భూ కేటాయింపులు చేశారని చెప్పారు.

విశాఖలోని రామానాయుడు స్టూడియోలో అనధికారికంగా ఇళ్ల పట్టాలు ఇచ్చారని చంద్రబాబు నాయుడు తెలిపారు. శారదా పీఠానికి కోట్ల రూపాయల విలువ చేసే భూమిని ఎకరా లక్ష రూపాయలకు కేటాయించారని చెప్పారు. మాజీ ఎంపీ ఏంవీవీకి చెందిన కంపెనీలకు కోట్ల రూపాయలు భూములు ఇచ్చారని తెలిపారు. ఎస్సీ ఎస్టీల నుంచి 10 వేల ఎకరాల అసైన్డ్ భూములను ఇళ్ల పట్టాల కోసం తీసుకున్నారని చెప్పారు.

Also Read: గుడ్‌న్యూస్.. పంటల రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం

ట్రెండింగ్ వార్తలు