Chandrababu Quash Petition : చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేసిన ఏపీ హైకోర్టు.. కారణాలు ఏంటి? న్యాయస్థానం ఏం చెప్పింది?

సీఐడీ తరపు లాయర్లు చేసిన ఆ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. Chandrababu Quash Petition

Chandrababu Quash Petition

Chandrababu Quash Petition – AP High Court : స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై కోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. అనంతరం తీర్పుని రిజర్వ్ చేసిన న్యాయస్థానం ఇవాళ (సెప్టెంబర్ 22) తుది నిర్ణయాన్ని వెలువరించింది. సీఐడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను కొట్టివేసింది. అసలు.. హైకోర్టు చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను ఎందుకు తోసిపుచ్చింది? కారణాలు ఏంటి? సీఐడీ చేసిన వాదనలు ఏంటి?

తీర్పులో ముఖ్యంగా రెండు జడ్జిమెంట్లు మెన్షన్ చేశారు:
చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేతకు సంబంధించి హైకోర్టు అడ్వొకేట్ మహేశ్ కీలక విషయాలు వెల్లడించారు. ”చంద్రబాబు దాఖలు చేసిన క్రిమినల్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది కోర్టు. 17ఏ అని అనుసరించి కన్సర్డ్ అథారిటీ పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి ఎఫ్ఐఆర్ చట్ట విరుద్ధం. ఎఫ్ఐఆరే చట్ట విరుద్ధం కాబట్టి చంద్రబాబు అరెస్ట్, జ్యుడీషియల్ రిమాండ్ కూడా చట్ట విరుద్ధం అని, చంద్రబాబుని వెంటనే విడుదల చేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద ఇవాళ తీర్పు వచ్చింది. తీర్పులో ముఖ్యంగా రెండు జడ్జిమెంట్లు మెన్షన్ చేశారు.(Chandrababu Quash Petition)

Chandrababu CID Interrogation

సుప్రీంకోర్టు తీర్పులను కోట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు:
భజన్ లాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా, నిహారిక ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసుల్లో ఇటువంటి పెద్ద కేసుల్లో 482 అప్లికేషన్లలో ఇన్వెస్టిగేషన్ లో కోర్టులు జోక్యం చేసుకోకూడదు. అలాగే కోర్టులు మినీ ట్రయల్ చేయకూడదు. అలాగే, ఈ సెక్షన్లు దీని మీద వర్తిస్తాయా లేవా అనేది కూడా కోర్టులు విచారించకూడదని చెప్పి ఈ మూడు ప్రిసిడెంట్స్ కు సంబంధించి భజన్ లాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా, నిహారిక ఇన్ ఫ్రాస్ట్రక్చర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసుల్లో సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో.. ఆ తీర్పులను కోట్ చేస్తూ 140 మంది సాక్షులను విచారించాము.

Also Read..Chandrababu Interrogation : సీఐడీ కస్టడీకి చంద్రబాబు.. కస్టడీలో సీఐడీ వేసే ప్రశ్నలు ఏంటి, ఏయే అంశాలపై ప్రశ్నిస్తారు.. విచారణ ఎలా ఉండబోతోంది?

ఈ సమయంలో జోక్యం చేసుకోలేము..
వాళ్ల స్టేట్ మెంట్లు కూడా రికార్డ్ చేశాము. 4వేల డాక్యుమెంట్స్ కలెక్ట్ చేశాము. కాబట్టి ఈ సమయంలో మీరు ఇన్వెస్టిగేషన్ లో వేలు పెట్టి చంద్రబాబుని విడుదల చేయడం వల్ల విచారణకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని, కాబట్టి ఈ సమయంలో దర్యాఫ్తులో మేము జోక్యం చేసుకోము అని చెబుతూ చంద్రబాబు తరపు న్యాయవాదులు చేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది.

Also Read..Nara Lokesh: అసలు నారా లోకేశ్ హస్తినకు ఎందుకు వెళ్లారు.. అక్కడ ఏం చేస్తున్నారు?

హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
కాగా.. చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ”కేసు అత్యంత కీలక దశలో ఉంది. ఈ సమయంలో జోక్యం చేసుకోలేము. సుమారు 140 మంది సాక్షులను సీఐడీ విచారించింది. ఇంత చేశాక ఇప్పుడు విచారణ ఆపమనడం సరికాదు. దర్యాఫ్తు సంస్థకు స్వేచ్ఛ ఇవ్వాలి” అని తీర్పులో వెల్లడించింది.

Chandrababu CID custody

17ఏ ను న్యాయమూర్తి పరిగణలోకి తీసుకున్నట్లు నాకు అనిపించలేదు. 17ఏ గురించి డిస్కషన్ జరగలేదని నేను అనుకుంటున్నాను. పూర్తి జడ్జిమెంట్ చూడాల్సి ఉంది. క్వాష్ పిటిషన్ మీద సుప్రీంకోర్టులో చంద్రబాబు అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది. హైకోర్టులోనే ఈ కేసుల్లో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాల్సి అవసరం ఉంది” అని హైకోర్టు అడ్వొకేట్ మహేశ్ వెల్లడించారు.