Telugu states : వానొచ్చే..వరదొచ్చే, తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు

నైరుతి రుతుపవనాల ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఇటు రైతులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురుస్తుండడంతో వ్యవసాయ పనులను ముమ్మరం చేశారు.

Telugu States Rains

Telugu States Rains : నైరుతి రుతుపవనాల ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఇటు రైతులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురుస్తుండడంతో వ్యవసాయ పనులను ముమ్మరం చేశారు.

హైదరాబాద్‌ మహానగరంలోని కొన్ని ప్రాంతాలు ఒక్కవర్షానికే విలవిలలాడాయి. లోతట్టు ప్రాంతాలు జలమయ మయ్యాయి. రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు నిలిచిపోయాయి. నాలాల పూడికతీత పూర్తికాకపోవడంతోనే మళ్లీ వరదలు వస్తున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉండడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు సిబ్బందిని అందుబాటులో ఉంచారు.

ఇటు ఏపీలోని కర్నూలు జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వర్కూరు దగ్గర తుమ్మలవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఆ వాగులో చిక్కుకున్న హెచ్‌పీ గ్యాస్ లారీ డ్రైవర్‌ను స్థానికులు కాపాడారు. నందవరం మండలం పెద్దకొత్తిలిలో వాగు ఉద్ధృతికి పంట పొలాలు నీట మునిగాయి. . వరద కారణంగా కర్నూలు- ఎమ్మిగనూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మంత్రాలయంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నల్లవంక వాగు పొంగి ప్రహిస్తుండటంతో విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌, ఎమ్మార్వో ఆఫీసులోకి వర్షపు నీరు చేరింది. కర్నాటక గెస్ట్‌ హౌస్‌లోకి నీరు చేరడంతో అక్కడ జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది.