Jogi Ramesh: టీడీపీ వైపు జోగి రమేశ్‌ అడుగులు.. జోగికి టీడీపీ హైకమాండ్ వెల్‌కమ్‌ చెబుతుందా?

వైసీపీ హయాంలో చంద్రబాబు నివాసంపై దాడికి సైతం ప్రయత్నించిన ట్రాక్ రికార్డ్ ఉన్న జోగి రమేశ్‌తో ఎలా కలిసి తిరుగుతారంటూ తమ నాయకులపై లోకల్‌ కేడర్‌ ఫైర్ అవుతోంది.

Jogi Ramesh

మాజీ మినిస్టర్ జోగి రమేశ్‌.. టీడీపీ వైపు అడుగులు వేస్తున్నారా..? వైసీపీకి జోగి గుడ్‌బై చెప్పడం ఇక ఖాయమైనట్లేనా..? ఎన్నికల తరువాత వైసీపీకి దూరంగా ఉంటున్న జోగి.. టీడీపీ నేతలతో ఎందుకు కలిసి తిరుగుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఇంటిపైనే దాడికి యత్నించిన జోగి రమేష్‌కు టీడీపీ హైకమాండ్‌ వెల్‌కమ్‌ చెబుతుందా? జోగి రమేశ్‌ పేరు చెబితేనే తెలుగు తమ్ముళ్లు ఎందుకు భగ్గుమంటున్నారు? అసలు జోగి పొలిటికల్ ఫ్యూచర్‌ ఏంటి?

వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్‌ ఎపిసోడ్ టీడీపీలో హాట్‌ డిబేట్‌గా మారింది.. వైసీపీ అధికారం కోల్పోయిన నాటి నుంచి ఆయన పార్టీ మారుతారంటూ ప్రచారం జరుగుతూనే ఉంది. వైసీపీ కార్యక్రమాలకు సైతం ఆయన అమడదూరంలో ఉంటున్నారు. పార్టీ మీటింగ్‌ల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు. పైగా టీడీపీ నేతలతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు.

ఓ పక్క కేసులు, మరో పక్క వైసీపీ అధిష్టానంపై అసంతృప్తి జోగి రమేశ్‌ను టీడీపీ వైపు చూసేలా చేస్తున్నాయనేది గాసిప్‌. ఎన్నికల ముందు నియోజకవర్గం మార్చడంతో జోగి తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష పోస్ట్ కావాలన్నా నాట్‌ పాజిబుల్‌ అని చెప్పింది అప్పట్లో వైసీపీ అధిష్టానం.. దీంతో అధికారం కోల్పోయిన క్షణం నుంచి పార్టీ ఆఫీస్ వంక కూడా చూడటానికి ఇష్టపడడం లేదట జోగి.

పార్థసారధి సపోర్ట్‌తో టీడీపీలోకి?
అంతేకాదు పార్టీ నుంచి జంప్‌ అవ్వాలనే ఉత్సాహం మీదున్న ఆయన మంత్రి పార్థసారధి సపోర్ట్‌తో టీడీపీలోకి వెళ్లేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారనేది లోకల్‌ టాక్‌.. మంత్రి ఎక్కడికి వెళ్తే అక్కడ కనిపిస్తున్నారు జోగి. తాజాగా నూజివీడులో గౌతు లచ్చన్న విగ్రహాష్కరణ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష భారీ ఊరేగింపు చేపట్టారు. ఈ ర్యాలీలో మంత్రి పక్కనే కనిపించారు జోగి రమేశ్‌..

జోగి యాక్టివిటీ టాక్‌ ఆఫ్‌ ది టూ పార్టీస్‌ అన్నట్లుగా మారింది.. ముఖ్యంగా టీడీపీ పెద్దలు గయ్‌మంటున్నారు.. వైసీపీ హయాంలో చంద్రబాబు నివాసంపై దాడికి సైతం ప్రయత్నించిన ట్రాక్ రికార్డ్ ఉన్న జోగి రమేశ్‌తో ఎలా కలిసి తిరుగుతారంటూ తమ నాయకులపై లోకల్‌ కేడర్‌ ఫైర్ అవుతోంది.. అంతేకాదు మంత్రి నారా లోకేశ్ సైతం మంత్రి పార్థసారథిపై గరమైనట్లు ఇన్‌సైడ్‌ టాక్‌.. మ్యాటర్‌ అంతటితోనే ఆగలేదు.. ఈ విషయంపై మంత్రి పార్థసారథి, గౌతు శిరీషను వివరణ కూడా కోరారనేది పార్టీ నేతల్లో జరుగుతున్న చర్చ..

టీడీపీ పెద్దల రియాక్షన్‌ చూస్తుంటే జోగి రమేశ్‌ను పార్టీ జెండాను కూడా తాకనిచ్చేది లేదన్నట్లుగా ఉంది.. జోగి రమేశ్‌ మాత్రం టీడీపీకి జై కొట్టేందుకే వెయింటింగ్‌ అంటున్నారు.. మరి ఈ ఎపిసోడ్‌లో టర్నింగ్‌ ఏంటన్నది ఇంట్రెస్టింగ్‌ లోకల్‌ గాసిప్‌గా మారింది.

లైఫ్‌లో ఫస్ట్‌ టైమ్ అమెరికా వెళ్లనున్న కేసీఆర్.. రెండు నెలలు అక్కడే ఉండేందుకు ప్లాన్