Kakinada Districrt
Kakinada District : మనుష్యుల్లో ప్రేమాభిమానాలు తగ్గిపోతున్నాయి. అనుబంధాలు ఆవిరి అయిపోతున్నాయి. పంతాలు పట్టింపుల మధ్య రక్త సంబంధీకులు చనిపోయిన పట్టించుకోని వారు కూడా ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ శునకం తనను పెంచిన యజమాని పట్ల చూపించిన విశ్వాసం చూస్తే కన్నీరు వస్తుంది. యజమాని గోదావరిలో దూకి చనిపోయిందన్న విషయం తెలీక శునకం ఆమె చెప్పుల దగ్గర కాపలా కాస్తోంది. తిరిగి ఎప్పుడు వస్తుందా? అని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తోంది.
Worlds Ugliest Dog 2023 : ప్రపంచంలోనే అంద వికారమైన శునకంగా గెలుపొందిన ‘స్కూటర్’ అనే డాగ్
కాకినాడ జిల్లా యానాంలో మనసుని కదిలించే సంఘటన జరిగింది. ఏం కష్టం వచ్చిందో? ఏమో? ఎదుర్లంక బ్రిడ్జి మీద చెప్పులు విడిచి గోదావరిలోకి దూకి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఇక ఆమె పెంపుడు శునకం ఈ విషయం గ్రహించక ఆమె విడిచిపెట్టిన చెప్పుల వద్దే తిరుగుతూ కనిపించింది. ఆమె ఎప్పుడు తిరిగి వస్తుందా? అని ఎదురుచూస్తోంది. ఈ దృశ్యం చూసేవారిని కంటతడి పెట్టిస్తోంది.
US University : యజమానితో పాటు డిప్లొమా డిగ్రీ అందుకున్న శునకం
బ్రిడ్జ్‌పై నుంచి దూకిన యువతిని యానాం ఫెర్రీ రోడ్‌లో నివాసం ఉంటున్న మందాగి కాంచనగా పోలీసులు గుర్తించారు. క్లూ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు.