US University : యజమానితో పాటు డిప్లొమా డిగ్రీ అందుకున్న శునకం

శునకాలు చాలా తెలివైనవి. మనం ఏది నేర్పితే అది నేర్చుకుంటాయి. తాజాగా ఓ శునకం డిప్లొమా డిగ్రీ అందుకుంది. తన యజమానితో పాటు క్రమం తప్పకుండా తరగతులకు హాజరైన ఈ శునకానికి ఓ యూనివర్సిటీ వారు డిగ్రీ పట్టా ఇచ్చారు. ఎక్కడో చదవండి.

US University : యజమానితో పాటు డిప్లొమా డిగ్రీ అందుకున్న శునకం

US University

Dog received diploma degree : కొన్ని జంతువులు మనం ఏది నేర్పితే అది అర్ధం చేసుకుంటాయి. చేసి చూపిస్తాయి. ఇటీవల కాలంలో కొన్ని జంతువులు చేసిన వింతలు, విడ్డూరాలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఓ శునకం తన యజమానితో పాటు డిప్లొమా డిగ్రీ అందుకుని అందర్నీ ఆశ్చర్యంలో ముంచేసింది.

Golden Retriever : యాడ్స్‌తో కోట్లు సంపాదిస్తున్న డాగ్

డాగ్ పాఠాలు ఎలా చదువుతుంది? దానికి ఎలా డిగ్రీ పట్టా ఇస్తారు? ఇలా మనకి చాలా డౌట్స్ వస్తాయి. కదా.. యూఎస్‌లోని న్యూజెర్సీ సెటన్ హాల్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జస్టిన్ అనే సర్వీస్ డాగ్ డిప్లొమా డిగ్రీ అందుకుని అందర్నీ ఆశ్చర్యంలో ముంచేసింది. మరియాని అనే యువతి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఎడ్యుకేషన్ డిగ్రీతో పట్టభద్రురాలైంది. ఆమె యూనివర్సిటీలో క్లాసులకు అటెండ్ అయ్యే క్రమంలో జస్టిన్ ఆమె వెంట వచ్చి క్లాసులకు అటెండ్ అయ్యేదట. తన యజమాని పట్ల అంకిత భావంతో పనిచేయడంతో జస్టిన్‌కు యూనివర్సిటీ వారు డిప్లొమా డిగ్రీని ప్రధానం చేశారట.

Mumbai : బోరివాలి టూ అంథేరి.. డెయిలీ ముంబయి లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తున్న డాగ్

ఇక జస్టిన్ డిప్లొమా డిగ్రీ అందుకున్న వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.  Seton Hall స్వయంగా ఈ వీడియోని ట్విట్టర్ లో షేర్ చేసింది.  ‘మీరిద్దరూ గ్రేట్.. ఇద్దరికి శుభాకాంక్షలు’ అని.. ‘ఈ వీడియో షేర్ చేసిన సెటన్ హాల్‌కి ధన్యవాదాలు’ అని కామెంట్లు పెట్టారు. జస్టిన్ ‘గ్రేట్ డాగ్’ అనిపించుకుంది.