Mekapati
Mekapati Vikram Reddy : నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభ ఉప ఎన్నికకు వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, కుటుంబ సభ్యులతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చి నామినేషన్ వేశారు. ఆత్మకూరు నుంచి ప్రాతినిధ్యం వహించిన మేకపాటి గౌతంరెడ్డి మరణంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది.
Bharat Kumar Yadav : ఆత్మకూరు ఉపఎన్నిక.. బీజేపీ అభ్యర్థి ఇతడే
గౌతంరెడ్డి సోదరుడు విక్రమ్‌రెడ్డిని వైసీపీ నాయకత్వం అభ్యర్థిగా నిర్ణయించింది. నామిషన్ దాఖలు చేసిన విక్రమ్‌రెడ్డి.. ఉప ఎన్నికను సీరియస్‌గా తీసుకుంటాన్నారు. మరోవైపు ఆత్మకూరులో లక్ష ఓట్ల భారీ మెజారిటీతో గెలుస్తామని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.