Bharat Kumar Yadav : ఆత్మకూరు ఉపఎన్నిక.. బీజేపీ అభ్యర్థి ఇతడే

నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఒక్కో పార్టీ తమ అభ్యర్థిని ప్రకటిస్తున్నాయి.

Bharat Kumar Yadav : ఆత్మకూరు ఉపఎన్నిక.. బీజేపీ అభ్యర్థి ఇతడే

Bharat Kumar Yadav

Bharat Kumar Yadav : నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఒక్కో పార్టీ తమ అభ్యర్థిని ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ తన అభ్యర్థిని అనౌన్స్ చేయగా, ఇప్పుడు బీజేపీ కూడా తన అభ్యర్థి పేరుని ఖరారు చేసింది.

ఈ స్థానంలో భరత్ కుమార్ యాదవ్ ను బరిలో దింపాలని బీజేపీ నిర్ణయించింది. కాసేపట్లో భరత్ కుమార్ యాదవ్ పేరును బీజేపీ అధికారికంగా ప్రకటించనుంది. ఆయన ఎల్లుండి తన నామినేషన్ వేయబోతున్నారు. భరత్ కుమార్ యాదవ్ ప్రస్తుతం నెల్లూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు.(Bharat Kumar Yadav)

Divya vani: నన్ను కుక్క పిల్లలా ఆడుకున్నారు.. గౌరవం లేని చోట ఉండలేకనే రాజీనామా

ఆత్మకూరు ఉపఎన్నికలో ఈ నెల 6వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు గడువుంది. నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి జూన్ 9వరకు అవకాశం ఇచ్చారు. 23న పోలింగ్ జరగనుంది. 29న ఫలితాలు ప్రకటిస్తారు. ఈ స్థానంలో వైసీపీ అభ్యర్థిగా మేకపాటి విక్రమ్ రెడ్డి బరిలోకి దిగనున్నారు. మేకపాటి కుటుంబం నుంచి రాజమోహన్ రెడ్డి మరో తనయుడే విక్రమ్‌ రెడ్డి.

ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభకు త్వరలోనే ఉపఎన్నిక జరగనుంది. మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఉపఎన్నిక అనివార్యమైంది. సాధారణంగా సిట్టింగ్ ఎమ్మెల్యే మరణిస్తే ఏకగ్రీవానికే అవకాశముంటుంది. కానీ ఆత్మకూరులో పోటీ అనివార్యంగా మారింది. సిట్టింగ్ స్థానాన్ని ఏకగ్రీవం చేసుకునేందుకు వైసీపీ కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు.

Mekapati Vikram Reddy : ఆత్మకూరు శాసనసభ ఉపఎన్నికకు వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి నామినేషన్‌

అసలు ఆ పార్టీనే పోలింగ్ జరగాలని కోరుకుంటోందా..? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఆత్మకూరులో భారీ మెజారిటీ సాధించి తమకు ప్రజాదరణ తగ్గలేదని ప్రతిపక్షాలకు గట్టి సంకేతాలివ్వాలనేది వైసీపీ వ్యుహంగా తెలుస్తోంది. ఆత్మకూరులో వైసీపీ అభ్యర్థిగా, గౌతమ్ రెడ్డి వారసుడిగా ఆయన సోదరుడు విక్రమ్ రెడ్డి బరిలో దిగుతున్నారు.

అటు బీజేపీ కూడా ఎన్నికకు రెడీ అయ్యింది. నిజానికి ప్రధాన పార్టీలు అంటే టీడీపీ, జనసేన పోటీ చేయడానికి సిద్ధంగా లేవు. జనసేన బీజేపీతో పొత్తులో ఉన్నా.. అలాంటి మొహమాటాలేమీ పెట్టుకోకుండా బీజేపీ ఏకపక్షంగా పోటీ చేస్తామని ప్రకటించింది. ఇప్పుడు జనసేన మద్దతిస్తుందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.

వైసీపీ అభ్యర్థి విక్రమ్ రెడ్డి గెలుపు నల్లేరుపై నడకే అని ప్రచారం జరుగుతన్నా.. ఎందుకైనా మంచిదని ఆయన ముందుగానే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఆత్మకూరులో సానుభూతి, సంక్షేమ పథకాలు వెరసి కనీసం లక్ష మెజారిటీ రాకపోతుందా అని వైసీపీ అంచనా వేస్తోంది.

వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి గురువారం తన నామినేషన్‌ దాఖలు చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, కుటుంబ సభ్యులతో కలిసి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి వచ్చి నామినేషన్‌ వేశారు. ఆత్మకూరులో లక్ష ఓట్ల భారీ మెజారిటీతో గెలుస్తామని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.