Divya vani: నన్ను కుక్క పిల్లలా ఆడుకున్నారు.. గౌరవం లేని చోట ఉండలేకనే రాజీనామా

తెలుగుదేశం పార్టీలో ఏడాది నుంచి నాకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు.. కనీసం గౌరవం కూడా ఇవ్వడం లేదు. గౌరవం లేనిచోట నేను ఉండలేకనే ఆ పార్టీకి రాజీనామా చేస్తున్న అంటూ దివ్య వాణి అన్నారు. గత రెండు రోజులుగా ఏపీ రాజకీయాల్లో దివ్యవాణి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. రెండు రోజుల క్రితం టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆమె ట్విటర్ లో పోస్టు చేశారు..

Divya vani: నన్ను కుక్క పిల్లలా ఆడుకున్నారు.. గౌరవం లేని చోట ఉండలేకనే రాజీనామా

Divya vani: తెలుగుదేశం పార్టీలో ఏడాది నుంచి నాకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు.. కనీసం గౌరవం కూడా ఇవ్వడం లేదు. గౌరవం లేనిచోట నేను ఉండలేకనే ఆ పార్టీకి రాజీనామా చేస్తున్న అంటూ దివ్య వాణి అన్నారు. గత రెండు రోజులుగా ఏపీ రాజకీయాల్లో దివ్యవాణి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. రెండు రోజుల క్రితం టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆమె ట్విటర్ లో పోస్టు చేశారు. కొద్దిగంటల్లోనే మళ్లీ దానిని డిలీట్ చేశారు. సోషల్ మీడియాలో వచ్చిన తప్పుడు వార్తల నేపథ్యంలోనే తాను రాజీనామా చేశానని, అలాంటిదేమీ లేదంటూ వ్యాఖ్యానించారు. కాగా బుధవారం దివ్యవాణి టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. అంతా సర్దుకుంటుందని టీడీపీ శ్రేణులు భావించినప్పటికీ బాబుతో భేటీ అనంతరం ఆమె పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి టీడీపీ నేతల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

Divyavani Resigns TDP : టీడీపీకి షాక్ ఇచ్చిన దివ్యవాణి..!

నాకు గతేడాది కాలంగా పార్టీలో ప్రాధాన్యత లేదని, కనీస మర్యాదకూడా దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మీడియా ఎదుటనే దివ్యవాణి కన్నీరు పెట్టుకున్నారు. చంద్రబాబు నాకు తండ్రిలాంటి వారని, చంద్రబాబును ఉద్దేశించి నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదని అన్నారు. నా బాధను మీడియాతో పంచుకోవడమే నేను చేసిన తప్పా అంటూ ఆమె ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు లాగా పార్టీ లేదు బొక్కా లేదు అని నేను అన్నానా.. నేనేదో అన్నానని నన్ను తప్పు పట్టిన వాళ్లు.. పార్టీ లేదు బొక్కా లేదన్న అచ్చెన్నని ఏం శిక్షించారు అంటూ దివ్య వాణి ప్రశ్నించారు. సాధినేని యామిని లాగా నేనేం విమర్శలు చేయలేదని అన్నారు. నాలాగా పార్టీలో ఇబ్బందులు పడేవారు చాలా మంది ఉన్నారని, కానీ వాళ్లకు పదవులు అవసరం కాబట్టి డాగ్స్ లా ఉంటున్నారని దివ్యవాణి విమర్శించారు.

Lokesh On TDP Changes : వరుసగా మూడుసార్లు ఓడినోళ్లకి నో టికెట్, టీడీపీలో సంస్ధాగతంగా సంచలన మార్పులు..!

నారీ – భేరీకి డబ్బులు తీసుకుని మేకప్ చేసుకుని కూర్చొవడం లేదని టీడీపీలోని పలువురిని ఉద్దేశించి సెటైర్లు వేశారు. చంద్రబాబు నన్ను విసుక్కున్నా నేనేం బాధపడడం లేదన్న దివ్యవాణి.. చంద్రబాబు నా తండ్రి లాంటి వారన్నారు. చంద్రబాబు సతీమణిని కొందరు తప్పుడు మాటలతో విమర్శిస్తే వారి కుటుంబ సభ్యుల కంటే ముందు నేనే కౌంటర్ ఇచ్చానని అన్నారు. గౌరవం లేని చోట నేను ఉండలేనని, అందుకే రాజీనామా లేఖను పార్టీకి పంపుతున్నట్లు దివ్యవాణి తెలిపారు. మతమార్పిడుల విషయంలో చంద్రబాబు చేసిన కామెంట్లు క్రైస్తవుల ఆగ్రహానికి గురయ్యారని, క్రైస్తవులు పడే బాధలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లలేకపోయానని అన్నారు. నేను ఇచ్చిన సమాచారంతో వేరే వారితో ప్రెస్ మీట్ పెట్టించారని, నేను చాలా బాధపడ్డానని వాపోయారు.

TDP Mahanadu : ‘క్విట్ జగన్..సేవ్ ఏపీ’ నినాదంతో తెలుగుదేశం పార్టీ మహానాడు

నెమ్మదిగా టీడీపీలో నా డౌన్ ఫాల్ మొదలైందని, ప్రెస్ మీట్లు పెట్టడానికి నలుగురు దగ్గరకు తిప్పుతున్నారని, టీడీ జనార్జన్ అనే వ్యక్తిని ప్రశ్నించినందుకు నన్ను ఇబ్బందులు పెట్టారని దివ్యవాణి వాపోయారు. పార్టీలో నన్ను కుక్క పిల్లలా ఆడుకున్నారని, కరివేపాకులా వాడుకుని వదిలేస్తారని నాకు చాలా మంది చెప్పినా వినలేదన్నారు. మహానాడు వేదిక మీద కూర్చొవడానికి వీల్లేదని, మాట్లాడే అవకాశం లేదని అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం మీద నేను విమర్శలు చేసినా నన్ను ఏనాడూ ఇబ్బంది పెట్టలేదని అన్నారు. పార్టీలో నా డబ్బుతో నేను ఖర్చు పెట్టుకుని పని చేశానని, కానీ నాకు పార్టీలో కనీస గుర్తింపు కూడా ఇచ్చేందుకు కొందరు ఇష్టపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అవమానాలు భరించలేకనే టీడీపీకి రాజీనామా చేస్తున్నానని దివ్వవాణి తెలిపారు.