TDP Mahanadu : ‘క్విట్ జగన్..సేవ్ ఏపీ’ నినాదంతో తెలుగుదేశం పార్టీ మహానాడు

మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రాబు వైసీపీ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. పసుపు రంగు శుభాన్ని సూచిస్తుందని..అటువంటి పాలనే తమ హయాంలో ప్రజలకు అందించామని గానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక అంతా అరాచకమే తప్ప ఎక్కడా అభివృద్ధి జాడ కూడా కనిపించట్లేదని ప్రతీచోటా హింస పెరిగిపోయింది అని విమర్శించారు.

TDP Mahanadu : ‘క్విట్ జగన్..సేవ్ ఏపీ’ నినాదంతో తెలుగుదేశం పార్టీ మహానాడు

Tdp Mahanadu In Ongole (1)

TDP Mahanadu in ongole : ప్రకాశం జిల్లా ఒంగోలులో తెలుగు దేశం పార్టీ ‘మహానాడు’ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత టీడీపీ తన వార్షిక మహానాడు సమావేశాలను ప్రజల మధ్యలో నిర్వహించడం ఇదే మొదటిసారి కావడంతో కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. ఒంగోలు పట్టణమంతా పసుపు జెండాలు రెపరెపలాడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు మహానాడుకు హాజరయ్యారు. ఈ మహానాడులో టీడీపీ 17 తీర్మానాలను ఆమోదించనుంది.

మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రాబు వైసీపీ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. పసుపు రంగు శుభాన్ని సూచిస్తుందని..అటువంటి పాలనే తమ హయాంలో ప్రజలకు అందించామని గానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక అంతా అరాచకమే తప్ప ఎక్కడా అభివృద్ధి జాడ కూడా కనిపించట్లేదని ఎక్కడపడితే అక్కడ హింస పెరిగిపోయింది అని విమర్శించారు. ఇటువంటి అరాచక పాలనకు చరమగీతం పాడాలని పార్టీ కార్యకర్తలకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.టీడీపీ 40 ఏళ్లు పూర్తి చేసుకుని 41 ఏళ్లలోకి ప్రవేశించిన సందర్భంగా ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో జరుపుకునే మహానాడులో ‘క్విట్ జగన్..సేవ్ ఏపీ’ నినాదంతో మహానాడు జరుపుకోవాలని అన్నారు.

జగన్ ఉన్మాద పాలన రాష్ట్రానికి శాపంగా మారిందన్నారు చంద్రబాబు. అటువంటి ఉన్మాద పాలన నుంచి ప్రజలను విముక్తుల్ని చేయాలని పిలుపునిచ్చారు. పాలన అంటే ఏమిటో కూడా అర్థం తెలియని దద్దమ్మల పాలనలో ఏపీ పరువుపోతోంది అని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. టీడీపీ నేతలు జగన్ అవినీతి పాలనపై ప్రశ్నిస్తుంటే అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని..నా తమ్ముళ్లు పార్టీ కోసం ఎంతో శ్రమిస్తున్నారని వారిని అక్రమంగా అరెస్ట్ లు చేస్తుంటే నాకు ఎంతో ఆవేదన కలుగుతోందని అని అనేక నిద్రలేని రాత్రుళ్లు గడిపాలనని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. ఈ మూడేళ్లు అరాచక పాలనలో ఎన్నో బాధపడ్డామని తాము బాధలు పడినా భరిస్తాం కానీ ప్రజలు పడే కష్టాల్ని చూడలేకపోతున్నాం అని చంద్రబాబు అన్నారు.

ఓ వైపు బాదుడు..మరోవైపు దోపిడీ..
ఓ వైపు ధరలు, బిల్లుల బాదుడు..మరోవైపు దోపిడీ ఇదే వైసీపీ ప్రభుత్వం చేస్తున్నది అని చంద్రబాబు అన్నారు. ఎన్నికల ముందు మద్యపాన నిషేధం అని నినదించిన వైసీపీ అధికారంలోకి వచ్చాక నాసిరకం బ్రాండ్లు పెట్టి ప్రభుత్వమే లిక్కర్ అమ్ముతోంది అని విమర్శించారు. జగన్ పాలన ఎలా ఉందంటే.. మద్యంపై తాకట్లు పెట్టి డబ్బులు తెస్తోందని అని ఎద్దేవా చేశారు. జగన్ చేతకాని తనం..దోపిడీతో ఏపి దివాళా తీసిందని అప్పుల ఊబిలో కూరుకుపోయిందని విమర్శించారు.ఏపీ ప్రస్తుతం రూ.8 లక్షల కోట్ల అప్పుకు చేరుకుందని తెలిపారు.

కాగా..శుక్రవారం (మే 27,2022) ఉదయం 9 గంటలకే మహానాడు ప్రారంభం కాగా, పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఉదయం 10.30 గంటల సమయంలో సభా ప్రాంగణానికి చేరుకున్నారు. దీంతో ఒక్కసారిగా కార్యకర్తలు ఉత్సాహంతో చంద్రబాబుకు జేజేలు పలుకుతూ స్వాగతం పలికారు.

టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సభను ప్రారంభించగా.. యర్రగొండపాలెం టీడీపీ ఇన్‌ఛార్జి ఎరిక్షన్ బాబు ప్రతినిధుల నమోదుతో మహానాడు ప్రారంభమైంది. తర్వాత ఒక్కొక్కరిగా నాయకులు ప్రసంగిస్తున్నారు. శుక్రవారం ఉదయం 11.45 గంటలకు చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేయనున్నారు. శుక్రవారం మహానాడు మొదటి రోజున 12 తీర్మానాలను టీటీడీ ప్రవేశపెట్టనుంది.