Titupati By Poll
Tirupati by-poll : తిరుపతి పార్లమెంట్ నియోజక వర్గంలో వైసీపీ అభ్యర్ధి డాక్టర్ గురుమూర్తి నాలుగు లక్షల పైగా మెజార్టీతో గెలుస్తారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. తిరుపతిపార్లమెంట్ నియోజకవర్గంలో 11 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని… చివరిక రౌండ్ వరకువైసీపీ అభ్యర్ధే ఆధిక్యంలో కొనసాగుతారని ఆయన చెప్పారు.
మొత్తం పోలైన ఓట్లలో 65 శాతం వైసీపీ కి వచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రజలు కూడా ఈ ఎన్నికల్లో స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేశారని ..ఈ విజయం భవిష్యత్తుకు మార్గదర్శకం అవుతుందని ఆయన అన్నారు.