MLA Grandhi Srinivas: మా తల్లి పేరు కూడా మరణించినట్లు చేర్చారు .. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం

టీడీపీ కుట్ర రాజకీయాలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు.

MLA Grandhi Srinivas

YCP MLA Grandhi Srinivas: వైసీపీ అనుకూల ఓట్లు మాయం చేసేందుకు టీడీపీ పెద్ద కుట్ర చేస్తోందని భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఓట్ల అక్రమాలకు అధికార పార్టీ పాల్పడుతుందని ఆరోపిస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి గత రెండురోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై 10టీవీతో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడారు. భీమవరం నియోజకవర్గంలో 10వేల ఓట్లు తొలగించాలని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారని అన్నారు. అందులో బ్రతికున్నవారిని చంపేసి వేలాది మంది ఓట్లు తొలగింపు కోరారని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ విమర్శించారు. అందులో మా తల్లి గ్రంథి వెంకటరత్నం పేరు కూడా మరణించినట్లు చేర్చారని, దీనిని బట్టిచూస్తుంటే ఇంకా పట్టణంలో ప్రముఖులతో సహా వేలాదిమందిని ఓటర్ లిస్టులో చంపేసే ప్రయత్నం టీడీపీ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Chandrababu : ఒంటరిగానే పోటీ, బీజేపీతో పొత్తుకు టైమ్ దాటి పోయింది : చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

టీడీపీ కుట్ర రాజకీయాలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. వజ్రాయుధం లాంటి ఓటు హక్కు ఏ ఒక్కరూ కోల్పోకుండా వినియోగించుకోవాలని అన్నారు. లోకేశ్ పాదయాత్ర పై స్పందిస్తూ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోకేశ్ చేస్తున్న పాదయాత్ర ప్రజలకోసం కాదు.. అధికారం కోసమే అన్నారు. పాదయాత్రకు జనం లేక శాంతి భద్రతల సమస్య తేస్తున్నారని విమర్శించారు.