MLA Mekapati
MLA Mekapati Chandrasekhar Reddy : ఏపీ ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేయలేమని తేల్చి చెప్పారు. కలిగిరి మండలం నా సముద్రంలో గడపగడపకు మన ప్రభుత్వం చేపట్టిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గ్రామస్తుల సమస్యలను తెలుసున్నారు. గ్రామంలో రోడ్లు దెబ్బ తిన్నాయని వెంటనే వేయాలని గ్రామస్థులు ఎమ్మెల్యేను కోరారు.
అయితే పైనుంచి పెండింగ్ బిల్లులకు డబ్బులు ఇవ్వడం లేదని చెప్పారు. సిమెంట్ రోడ్లు వేయలేమని స్పష్టం చేశారు. పనులు చేసిన వారికి డబ్బులు రాలేదని చెప్పారు. ఇలాగైతే పనులు చేయడం కష్టం అని అన్నారు. వడ్డీలకు అప్పులు తెచ్చి ఎవరు పనులు చేస్తారని స్వయంగా ఎమ్మెల్యే అనడంతో గ్రామస్తులు అవాక్కయ్యారు.