Perni Nani: రాష్ట్రానికి పట్టిన అంటు రోగం, దరిద్రం చంద్రబాబే .. మే నెలలో బందర్ పోర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన

మే నెలలో సీఎం జగన్ బందర్ పోర్ట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని పేర్ని నాని అన్నారు. మంచి ముహూర్తం కోసం చూస్తున్నామని, మే మొదటి, రెండు వారాల్లో శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని తెలిపారు.

Perni Nani

Perni Nani: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బందర్‌లో నిర్వహించిన సభ అట్టర్ ప్లాప్ అయిందని, ఖాళీ కుర్చీలు తప్ప అక్కడ ప్రజలెవరూ కనిపించలేదని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని ఎద్దేవా చేశారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బందర్ సభకు జనంరాక చంద్రబాబు షాక్ లో ఉన్నాడని అన్నారు. బందర్‌కి వచ్చే నైతిక అర్హత చంద్రబాబుకి లేదు. సీఎంగా ఉనప్పుడు బందర్‌కి ఏమీ చేశావ్ చంద్రబాబు అంటూ ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో బందర్ పోర్టు కడతానని 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చి గాలికి వదిలేశాడని పేర్ని నాని విమర్శించారు.

Perni Nani: పవన్, బాలకృష్ణతో తిరిగి మాపై చంద్రబాబు సినిమా డైలాగులు వదులుతున్నారు: పేర్ని నాని

రాత్రికిరాత్రి 3వేల ఎకరాలు బలవంతపు భూ సేకరణ చేస్తే ప్రజలు తిరగబడరా..? కోర్టుకి వెళ్ళారా..? అంటూ ప్రశ్నించారు. మేము ఒక్క సెంటు భూ సేకరణ చెయ్యకుండా ప్రభుత్వ భూమిలో పోర్ట్ నిర్మాణం చేయబోతున్నామని చెప్పారు. మే నెలలో సీఎం జగన్ బందర్ పోర్ట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని పేర్ని నాని అన్నారు. మంచి ముహూర్తం కోసం చూస్తున్నామని, మే మొదటి, రెండు వారాల్లో శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. చంద్రబాబు నాపై అసత్య ఆరోపణలు చేశాడు. నాపై చేసిన ఆరోపణలు తప్పు అని నిరూపిస్తా.. దమ్ముంటే డిబేట్‌కు విజయవాడకు రా చంద్రబాబు అంటూ పేర్నినాని సవాల్ విసిరారు.

Somu Veeraju : సీఎం జగన్‌కు బీజేపీ ఏపీ అధ్యక్షులు సోము వీర్రాజు లేఖ

పేర్ని నాని అనేవాడికి చెయ్యి జాపి అడిగే అలవాటు లేదు, పాపపు సొమ్ము నా ఇంటి గుమ్మం దాటదు. ఐదేళ్లు అధికారంలో ఉండి ప్రజల సొమ్ము చంద్రబాబు అండ్ కో బందర్ హల్వా తినట్టు తినేశారంటూ విమర్శించారు. జగన్ బటన్ నొక్కేది ప్రజల సంక్షేమం కోసమని, మీలా సొంత సంక్షేమం కోసం కాదంటూ నాని అన్నారు. రాష్ట్రానికి పట్టిన అంటు రోగం, దరిద్రం చంద్రబాబేనని, 2014 నుండి 2019 పాలన మళ్ళీ తీసుకుని వస్తానని దమ్ముగా చెప్పగలరా అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. చంద్రబాబు కంటే పెద్ద సైకో ఎవరూ లేరని, పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి, బావమర్ధుల గొంతు కోసి, తోళల్లుడిని మోసం చేసిన వాడు సైకో కదా అంటూ ప్రశ్నించారు.