Prakash Javadekar : వైసీపీ, టీడీపీ, టీఆర్‌ఎస్ కరప్షన్ పార్టీలు : ప్రకాశ్ జవదేకర్
అప్పట్లో టీడీపీ గెలిచిందంటే మోదీ వళ్లేనని స్పష్టం చేశారు. చంద్రబాబు మోదీని వ్యతిరేకించారు.. అధికారాన్ని కోల్పోయారని చెప్పారు. ఉద్యోగాల భర్తీలో రాష్ట్ర ప్రభుత్వం మాట తప్పిందన్నారు.
- bheemraj
- Published On : December 28, 2021 / 07:09 PM IST
Prakash
Union Minister Prakash Javadekar : పోలవరం అనుమతులు తన హయాంలోనే ఇచ్చానని…ఇంతవరకు ప్రాజెక్టును పూర్తి చేయలేదని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ విమర్శించారు. రాజధాని కోసం టీడీపీ, వైసీపీ కొట్టుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. విజయవాడలో బీజేపీ ప్రజా ఆగ్రహ సభలో ఆయన పాల్గొని, ప్రసంగించారు. వైసీపీ, టీడీపీ, టీఆర్‌ఎస్ కరప్షన్ పార్టీలని ఆయన ఆరోపించారు.
అప్పట్లో టీడీపీ గెలిచిందంటే మోదీ వళ్లేనని జవదేకర్ స్పష్టం చేశారు. చంద్రబాబు మోదీని వ్యతిరేకించారు.. అధికారాన్ని కోల్పోయారని పేర్కొన్నారు. ఏపీలోని చాలా మంది నేతలు బెయిల్‌పై బయట ఉన్నారు.. మళ్లీ జైలుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. జగన్ సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామన్నారని..ఇప్పుడు యథేశ్చగా మద్యాన్ని అమ్ముతున్నారని తెలిపారు.
Omicron Cases : తెలంగాణలో కొత్తగా 7 ఒమిక్రాన్ కేసులు నమోదు
ఉద్యోగాల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మాట తప్పిందని జవదేకర్ అన్నారు. జగనన్న కాలనీలన్నీ.. మోదీ కాలనీలేనని స్పష్టం చేశారు. గృహ నిర్మాణానికి కేంద్రం నిధులు ఇస్తోందన్నారు. జగనన్న ఆరోగ్య కానుకకు కేంద్రం నిధులు ఇస్తోందని చెప్పారు. కేంద్ర పథకాలకు.. రాష్ట్ర ప్రభుత్వం పేర్లు పెట్టుకుంటోందన్నారు.
