Omicron Cases : తెలంగాణలో కొత్తగా 7 ఒమిక్రాన్ కేసులు నమోదు

రాష్ట్రంలోని 62 మంది ఒమిక్రాన్ బాధితుల్లో 46 మంది వ్యాక్సిన్ తీసుకోలేదని మంత్రి హరీష్ రావు అన్నారు. వ్యాక్సిన్ తీసుకోని వారిలో పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉందని తెలిపారు.

Omicron Cases : తెలంగాణలో కొత్తగా 7 ఒమిక్రాన్ కేసులు నమోదు

Omicron 11zon

new Omicron cases in Telangana : ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్ లో కలవరం రేపుతోంది. తెలంగాణలోనూ ఒమిక్రాన్ విజృంభిస్తోంది. రాష్ట్రంలో వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో ఇవాళ కొత్తగా 7 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 62కు చేరింది.

రాష్ట్రంలోని 62 మంది ఒమిక్రాన్ బాధితుల్లో 46 మంది వ్యాక్సిన్ తీసుకోలేదని మంత్రి హరీష్ రావు అన్నారు.
వ్యాక్సిన్ తీసుకోని వారిలో పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉందని తెలిపారు. వ్యాక్సిన్ ప్రాముఖ్యతను ప్రజలు గర్తించాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. తెలంగాణలో ఇప్పటివరకు 62 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయని తెలిపారు.

Woman Protest : ప్రేమ పెళ్లి.. కాపురానికి తీసుకెళ్లడం లేదని భర్త ఇంటి ముందు భార్య నిరసన

నిన్న ఒక్కరోజే 12 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఓ బాధితుడికి ఒమిక్రాన్ సోకడంతో అతడిని హైదరాబాద్ టిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లేటెస్ట్ గా తల్లి, భార్యతో పాటుగా బాధితుడి మిత్రుడికి…కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు.  అంతకముందు వారి శాంపిళ్లను తీసుకుని జీనోమ్ సీక్వెన్స్ పరీక్షలకు పంపారు. సోమవారం వారికి సంబంధించిన పరీక్షల రిజల్ట్స్ వచ్చాయి. ముగ్గురికి ఒమిక్రాన్ సోకినట్లు నిర్ధారించారు. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లా వాసులు గజగజ వణికిపోతున్నారు. ఇప్పటికే గ్రామాన్ని పదిరోజుల పాటు సెల్ఫ్ లాక్ డౌన్ చేస్తున్నట్లు పంచాయితీ తీర్మానం చేసిన సంగతి తెలిసిందే.

కొత్తగా ఎట్‌ రిస్క్‌ దేశాల నుంచి 2వందల 48 మంది శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారందరికీ RTPCR టెస్టులు చేయగా ఇద్దరు ప్రయాణికులకు కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు వారి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కి పంపించారు. తెలంగాణలో ఒమిక్రాన్‌ బారిన పడిన వారిలో ఇప్పటి వరకు 10 మంది కోలుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఎట్‌ రిస్క్‌ దేశాల నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి 11వేల 493 మంది ప్రయాణికులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.