Woman Protest : ప్రేమ పెళ్లి.. కాపురానికి తీసుకెళ్లడం లేదని భర్త ఇంటి ముందు భార్య నిరసన

కడప జిల్లాకు చెందిన సుహాసినికి.. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లోని విద్యానగర్‌కు చెందిన సుజిత్‌రెడ్డికి 2011లో ఆన్‌లైన్‌లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.

Woman Protest : ప్రేమ పెళ్లి.. కాపురానికి తీసుకెళ్లడం లేదని భర్త ఇంటి ముందు భార్య నిరసన

Woman

woman protested in front of husband’s house : ఆన్‌లైన్‌లో పరిచయమైన వారిద్దరి స్నేహం.. ప్రేమకు దారితీసింది. పదేళ్ల పాటు ప్రేమించుకున్నారు. పెద్దలు ప్రేమకు నిరాకరించడంతో ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. పెళ్లైన తర్వాత కాపురానికి తీసుకెళ్లకుండా ఆమెను ఒంటరిగా వదిలేసి పరారయ్యాడు ఆ దుర్మార్గుడు. దీంతో బాధితురాలు 25 రోజుల నుంచి భర్త ఇంటి ముందు ధర్నాకు చేస్తోంది. తనకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తోంది.

కడప జిల్లాకు చెందిన సుహాసినికి.. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లోని విద్యానగర్‌కు చెందిన సుజిత్‌రెడ్డికి 2011లో ఆన్‌లైన్‌లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ పదేళ్ల పాటు ప్రేమించుకున్నారు. ఇద్దరి కులాలు ఒక్కటైనప్పటికి సుజిత్‌రెడ్డి కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించడంతో 2020 నవంబర్ 25న సుహాసిని-సుజిత్ ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు.

CM Kejriwal:ఢిల్లీలో డాక్టర్ల ధర్నాపై ప్రధాని మోడీకి సీఎం కేజ్రీవాల్ లేఖ

అయితే పెళ్లి తర్వాత తన కుటుంబసభ్యులను ఒప్పించి ఇంటికి తీసుకెళ్తానన్న సుజిత్‌.. సుహాసిని వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడు తీసుకెళ్తా.. ఇప్పుడు తీసుకెళ్తానంటూ చాలా కాలం గడిపాడు. దీంతో విసిగిపోయిన సుహాసిని గత నెల 26న భర్త సుజిత్‌ ఇంటికి వచ్చింది. సుహాసిని ఏకంగా ఇంటికి రావడంతో కోపోద్రిక్తులైన కుటుంబ సభ్యులు ఆమెపై విచాక్షణారహితంగా దాడి చేశారు.

2018లో కువైవ్‌లో ఉన్న తనను వివాహం చేసుకుంటామని చెప్పి ఇండియాకు రప్పించారని బాధితురాలు వాపోయింది. తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మిగిలిన తనకు అత్తింటి వారు ఆదరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. గత నెల రోజులకు పైగా అత్తింటి వారి ముందు కూర్చుని నిరసన తెలుపుతున్నా.. కనికరించడం లేదని రోధిస్తోంది. గత నెల 26 నుంచి చలిలో న్యాయ పోరాటం చేస్తున్న బాధితురాలికి ఇరుగు పొరుగు వారు ఆహారం అందిస్తున్నారు.

Traffic Challan On Bike : ఒకే బైక్‌పై 139 చలానాలు..రూ.54,195 జరిమానా

మరోవైపు ఇంటి చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్న సుజిత్‌రెడ్డి.. సుహాసినికి సహకరిస్తున్న వారిని బెదిరిస్తుండడంతో వారు సహాయం అందించడం మానేశారు. ప్రేమ పెళ్లి జరుగుతుందనే ఆశతో కువైట్‌ నుంచి ఇండియాకు వచ్చానని సుహాసిని తెలిపింది. తనకు జరిగిన అన్యాయంపై క్రిమినల్‌ కేసు నమోదు చేశామని తెలిపారు. అయితే అత్తింటి వారి నుంచి ఎలాంటి స్పందన లేదని వాపోయింది. తనను కాపురానికి తీసుకెళ్లేంత వరకు సుజిత్ ఇంటి నుంచి కదలను అని భీష్మించుకుని కూర్చుంది.