ఫార్మసిస్ట్ ఆత్మహత్య….రాజకీయ పార్టీకి చెందిన నాయకుడిపై ఆరోపణలు

  • Publish Date - October 16, 2020 / 12:39 PM IST

young pharmacist committed suicide : పశ్చిమగోదావరిజిల్లా ఏలూరులో ఓ ఫార్మసిస్ట్ ఆత్మహత్య చేసుకుంది. ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు మోసం చేయటం వల్లే తన కుమార్తె సూసైడ్ చేసుకుందని తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు.

ఏలూరు కు చెందిన వెదురుపర్తి సౌజన్య(24) అనే యువతి హైదరాబాద్ లోని ప్రముఖ ఫార్మా కంపెనీలో ఫార్మసిస్టుగా పని చేస్తోంది. కరోనా కారణంగా స్వగ్రామం ఏలూరు వెళ్ళి ఇంటివద్ద నుంచే (వర్క్ ఫ్రం హోం) పని చేస్తోంది. ఈక్రమంలో ఆమెకు ఏలూరుకు చెందిన సింహాద్రి బాలు అనే వ్యక్తి పరిచయం అయ్యాడు.



గురువారం తన ఇంట్లోనే సౌజన్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమెను ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందింది. సింహాద్రి బాలు జనసేన పార్టీలో చురుకైన నాయకుడని…అతను మోసం చేయడంతోనే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని సౌజన్య తండ్రి ఆరోపించారు.



గతంలోనూ ఓ యువతిని వేధించిన కేసులో బాలును ఏలూరు వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. బాలు, సౌజన్య తండ్రి ఇద్దరూ జ్యూయలరీ వ్యాపారం నిర్వహించటం గమనార్హం. కాగా …సూసైడ్ కు ముందు సౌజన్య తన చావుకు ఎవరూ కారణం కాదంటూ సెల్ఫీ వీడియో తీసుకుంది. దీనిపై కేసు నమోదు చేసిన ఏలూరు టూటౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.