ప్రేమను తిరస్కరించిందని పెట్రోల్ పోసి కాల్చిన ప్రియుడు

  • Publish Date - October 13, 2020 / 09:10 AM IST

molestation : ప్రేమిస్తున్నానని వెంటపడి వేధించిన యువకుడు, యువతి పోలీసు కేసు పెట్టిందని ఆమెను సజీవ దహనం చేసాడు ఆసమయంలో యువకుడిగా నిప్పంటుకుని తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్నాడు.




కృష్ణా జిల్లా విస్సన్నపేటకు చెందిన చిన్నారి అనే యువతి విజయవాడ కోవిడ్ కేర్ సెంటర్ లో నర్సుగా విధులు నిర్వహిస్తోంది. స్నేహితురాళ్లతో కలిసి ఆస్పత్రి సమీపంలోనే ఓ గది అద్దెకు తీసుకుని ఉంటోంది. రెడ్డి గూడెం మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన నాగభూషణం అనే వ్యక్తి చిన్నారిని కొంతకాలంగా ప్రేమిస్తున్నానని వెంటపడుతున్నాడు.

అతని వేధింపులు భరించలేని చిన్నారి నాలుగు రోజుల క్రితం నాగభూణంపై విజయవాడ గవర్నర్ పేట పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు యువకుడ్ని పిలిచి మందలించారు. మరోసారి ఆమె వెంట పడనని, ఆమెను ఏమీ చేయనని కాగితం రాయించు కున్నారు. దీంతో ఆమె నాగభూషణంపై పెట్టిన కేసు ఉపసంహరించుకుంది.




రోజూ లాగానే సోమవారం ఆస్పత్రిలో విధులు పూర్తి చేసుకుని రాత్రి 9 గంటల సమయలో ఒంటరిగా ఇంటికి వెళుతుండగా…మళ్లీ చిన్నారి వెంట పడ్డాడు నాగభూషణం. ఆమెతో మట్లాడచానిక ప్రయత్నించాడు. ఆమె మాట్లాడకుండా వడి వడిగా తన ఇంటికివెళ్లిపోవాలని ప్రయత్నించింది.

ఆ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆమె వెంట పడుతూ ఇంటిదాకా వచ్చాడు. అయినప్పటికి చిన్నారి నాగభూషణంతో మాట్లాడటానికి నిరాకరించటంతో …కోపంతో రగిలిపోయి…. తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్ ఆమెపై పోసి నిప్పంటించాడు.




ఈ సమయంలో నాగభూషణానికీ నిప్పంటుకుంది. ఈ ఘటనలో చిన్నారి అక్కడికక్కడే మరణించగా , తీవ్ర గాయాలపాలైన నాగభూషణాన్ని విజయవాడ ప్రభుత్వాసు పత్రికి తరలించారు. అక్కడ అతని పరిస్ధితి విషమించటంతో, మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.