YS Jagan Srikakulam: అప్పల్రాజుతో జగన్ మిలాఖత్ క్యాన్సిల్.. ప్రభుత్వంపై ఫైర్
YS Jagan Srikakulam Tour: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో చెడు విత్తనాలను నాటుతోందని.. ఇది రేపు పెరిగి మహావృక్షం అవుతుందని వైఎస్ జగన్ హెచ్చరించారు.
- Ashok Bonepalli
- Updated on- July 30, 2026 / 06:56 PM IST
Ys Jagan Comments On Seediri Appalraju At Srikakulam Jail
YS Jagan Srikakulam Tour: మాజీ మంత్రి అప్పల్రాజును రాజకీయంగా తొక్కేయడానికి టీడీపీ కుట్ర చేస్తోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లాలో జైల్లో ఉన్న సీదిరి పరామర్శించేందుకు వైఎస్ జగన్ వెళ్లారు. అయితే, ఆయన వెళ్లేసరికి మిలాఖత్ సమయం ముగిసిపోయింది. దీంతో జైలు నిబంధనల ప్రకారం మిలాఖత్ కు పోలీసులు అనుమతించలేదు. చేసేది లేక జగన్.. అక్కడున్న సీదిరి అప్పల్రాజు కుటుంబసభ్యులను పరామర్శించారు. సీదిరి అప్పల్రాజు పదో తరగతిలో టాపర్ అని, ఆయన స్వయంకృషితో ఎదిగారని జగన్ అన్నారు. సాక్షాత్తూ చంద్రబాబే అప్పట్లో అప్పల్రాజుకు అవార్డు ఇచ్చారన్నారు. అలాంటి అప్పల్రాజును రాజకీయంగా ఎదగనివ్వకుండా అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్ర చేశారని జగన్ ఆరోపించారు.
Also Read: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ భారీ శుభవార్త.. బ్యాంక్ ఖాతాల్లోకి రూ.5వేలు జమ..
అప్పల్రాజు కుమారుడు కేవలం 18 ఏళ్ల వాడు పొరపాటున యాక్సిడెంట్ చేస్తే దాన్ని హత్యగా చిత్రీకరించేందుకు కుట్ర చేశారని జగన్ ఆరోపించారు. టీడీపీ నేతలు కార్లు ప్రమాదాలు చేసినప్పుడు ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదని జగన్ ప్రశ్నించారు. ఆ ప్రమాదం జరిగినప్పుడు అప్పల్రాజు కొడుకు స్వయంగా ఆంబులెన్స్ కు ఫోన్ చేశాడని, స్వయంగా ఆ బాధితుడిని కాపాడేందుకు సీపీఆర్ కూడా చేశాడని జగన్ చెప్పారు. ప్రమాదం జరిగిన తర్వాత బాధిత కుటుంబానికి సాయం చేయడానికి అప్పల్రాజు ప్రయత్నం చేస్తే అది కూడా అందనివ్వకుండా కుట్ర చేశారని ఆరోపించారు.
మరోవైపు కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. మత్స్యకారులు, యాదవులకు మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారన్నారు. కేవలం ఈ రెండు కులాలకే కాదని, బీసీలకు బాబు అన్యాయం చేస్తున్నారన్నారు. చేయూత, ఆసరా, సున్నావడ్డీ పథకాలు ఏవీ అందడం లేదని, తన హయాంలో ఇచ్చిన పథకాలేవీ రావడం లేదన్నారు. ఫీజు రీయింబర్స్ కూడా బకాయిలు పెట్టేశారని జగన్ ఆరోపించారు.
ఇక అప్పల్రాజును కలిసేందుకు అవకాశం లేకపోవడంతో ఆ కుటుంబాన్ని జైలు బయటే పరామర్శించారు జగన్. అప్పల్రాజు భార్య తనకు చెల్లెలి లాంటిదన్న జగన్.. ఆ కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
