YS Jagan: ఈ ప్రాంతాల్లో ఏపీ సీఎం జగన్ ఎన్నికల ప్రచారం
జగన్ నిన్న కూడా మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
- T Venkateshwarlu
- Published On : April 30, 2024 / 08:54 AM IST
CM Jagan
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ మరో మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని కొండెపి నియోజకవర్గంలోని టంగుటూరులో ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు.
మధ్యాహ్నం 12.30 గంటలకు కడప పార్లమెంట్ పరిధిలోని మైదుకూరు నియోజకవర్గంలో మైదుకూరు 4 రోడ్ల జంక్షన్ లో ఎన్నికల ప్రచార సభ ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలకు రాజంపేట పార్లమెంట్ పరిధిలోని పీలేరు నియోజకవర్గంలోని కలికిరిలో ఎన్నికల ప్రచార సభలో జగన్ పాల్గొంటారు.
జగన్ నిన్న కూడా మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా చోడవరంలో కొత్తూరు జంక్షన్ లో మొదటి ప్రచార సభ నిర్వహించారు. మధ్యాహ్నం 12.30 గంటలకు అమలాపురం పార్లమెంట్ పరిధిలో పి.గన్నవరం నియోజకవర్గంలో అంబాజీపేట బస్టాండ్ రోడ్‌లో సభలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు గుంటూరు పార్లమెంట్ పరిధిలోని పొన్నూరు ఐలాండ్ సెంటర్ లో ప్రచార సభలో పాల్గొని ప్రసంగించారు.
Also Read: ఎన్నికల వేళ రెబల్స్‌గా పోటీ చేస్తున్న వారిపై టీడీపీ సస్పెన్షన్ వేటు
