ఎన్నికల వేళ రెబల్స్‌గా పోటీ చేస్తున్న వారిపై టీడీపీ సస్పెన్షన్ వేటు

TDP: అరకు నియోజకవర్గానికి చెందిన సివేరి అబ్రహాం, విజయనగరం నియోజకవర్గానికి చెందిన మీసాల గీత

ఎన్నికల వేళ రెబల్స్‌గా పోటీ చేస్తున్న వారిపై టీడీపీ సస్పెన్షన్ వేటు

Tdp

Updated On : April 30, 2024 / 3:27 PM IST

TDP Rebels Suspension: ఎన్నికల వేళ రెబల్స్‌గా పోటీ చేస్తున్న వారిని టీడీపీ.. పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు వారిని సస్పెండ్ చేస్తున్నట్లు టీడీపీ తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

అరకు నియోజకవర్గానికి చెందిన సివేరి అబ్రహాం, విజయనగరం నియోజకవర్గానికి చెందిన మీసాల గీత, అమలాపురం నియోజకవర్గానికి చెందిన పరమట శ్యాం కుమార్, పోలవరం నియోజకవర్గానికి చెందిన ముడియం సూర్య చంద్రరావు, ఉండి నియోజకవర్గానికి చెందిన వేటుకూరి వెంకట శివరామరాజు, సత్యవేడు నియోజకవర్గానికి చెందిన జడ్డా రాజశేఖర్ ను సస్పెండ్ చేసినట్లు స్పష్టం చేసింది.

కాగా, ఎన్నికల్లో ఐదుగురు అసెంబ్లీ అభ్యర్థులను టీడీపీ మార్చిన విషయం తెలిసిందే. వెంకటగిరి, ఉండితో పాటు మాడుగుల, పాడేరు, మడకశిర స్థానాల్లో మార్పులు జరిగాయి. మడకశిర నియోజకవర్గానికి ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్యే ఈరన్న, ఆయన కుమారుడు సునీల్ కుమార్ నేడు రిటర్నింగ్ అధికారి వద్ద వారు దాఖలు చేసిన నామ పత్రాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.

Also Read: అక్కడి నుంచి బరిలోకి రాహుల్ గాంధీ, ప్రియాంక..? ఒకప్పటి కంచుకోటలపై కాంగ్రెస్ ఫోకస్