YS Jagan-Mega DSC: మెగా డీఎస్సీపై జగన్ సంచలన కామెంట్స్ .. అర్హత లేని వారికి ఉద్యోగాలు.. సీబీఐ విచారణకు డిమాండ్

AP Mega DSC: ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ నియామకాల వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఎన్డీయే కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ (Ys Jagan)మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ys jagan demands cbi probe over alleged irregularities in ap mega dsc recruitment

  • మెగా డీఎస్సీపై జగన్ ఆరోపణలు
  • కర్నూలు పోస్టింగ్‌పై సీబీఐ డిమాండ్
  • వైఎస్‌ఆర్‌సీపీ కోర్టు పోరాటానికి సిద్ధం

YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ నియామకాల వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఎన్డీయే కూటమి ప్రభుత్వంపై వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Ys Jagan) మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డీఎస్సీ ప్రక్రియలో అర్హత లేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టారని, దీనికి సంబంధించిన ఆధారాలు స్పష్టంగా బయటపడుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ నియామకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని, దీనిపై తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించాలని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశారు.

Read Also – Jakkampudi Raja: వైకాపా నేత జక్కంపూడి రాజాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు.. షాక్‌లో వైకాపా శ్రేణులు

కర్నూలు ఘటనపై ప్రశ్నలు:

కర్నూలు జిల్లాలో టెట్‌లో కనీస అర్హత మార్కులు సాధించని అభ్యర్థికి స్పోర్ట్స్ కోటా కింద ఎస్‌జీటీ పోస్ట్ ఎలా కట్టబెట్టారని జగన్ ప్రశ్నించారు. దరఖాస్తు వెరిఫికేషన్ దశలోనే తిరస్కరించాల్సిన ప్రొఫైల్‌ను దాటుకుని ఉద్యోగం పొందేలా వెనుకుండి నడిపిన ‘అదృశ్య శక్తి’ లోకేష్ కాదా అని నిలదీశారు. అలాగే అటవీశాఖలో జీఓ నంబర్-4ను ఉపయోగించి 40 పోస్టులను అక్రమంగా భర్తీ చేసేందుకు యత్నించారని, ఈ కుంభకోణం బయటపడటంతోనే మిగిలిన పోస్టుల భర్తీని కూడా నిలిపివేశారని ఆరోపించారు.

కోర్టు పోరాటానికి వైఎస్‌ఆర్‌సీపీ సిద్ధం:

ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ పాత్ర ఉందనే భయంతోనే ప్రభుత్వం సీబీఐ విచారణకు అంగీకరించడం లేదని జగన్ మండిపడ్డారు. సొంత అధికారులతో జరిపే విచారణలు ఎన్నటికీ పారదర్శకంగా ఉండవని స్పష్టం చేశారు. పేపర్ లీకేజీల నుంచి పోస్టింగ్ ఆర్డర్ల వరకు, టెట్ అర్హతల నుంచి స్పోర్ట్స్ కోటా వరకు మొత్తం ప్రక్రియను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ నిజాయితీగల అభ్యర్థుల పాలిట దగాగా మారిందని, భాధితులైన యువత తరఫున కోర్టుల్లో పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు.