YS Jagan : ఎల్లకాలం ఇదే ప్రభుత్వం కొనసాగదు.. కూటమి ప్రభుత్వానికి జగన్ వార్నింగ్.. రాష్ట్రంలో హార్బర్లు అన్ని మత్స్యకారుల సంపదే..
YS Jagan : రాష్ట్రంలో అన్ని రంగాల్లో అన్యాయాలు జరుగుతున్నాయని , ఫిషింగ్ హార్బర్లను దుర్మార్గంగా ప్రైవేటీకరణ చేస్తున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
- Harishth Thanniru
- Updated on- April 15, 2026 / 12:54 PM IST
ys jagan juvvaladinne fishing harbor visit
- ఫిషింగ్ హార్బర్లు మత్స్యకారుల హక్కు.
- జువ్వలదిన్నెను జాతికి అంకితం చేసి రెండేళ్లవుతుంది
- మత్య్సకారుల చేతికి ఎందుకు ఇవ్వలేదు?.
- కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైఎస్ జగన్
YS Jagan : రాష్ట్రంలో అన్ని రంగాల్లో అన్యాయాలు జరుగుతున్నాయని , ఫిషింగ్ హార్బర్లను దుర్మార్గంగా ప్రైవేటీకరణ చేస్తున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం వైఎస్ జగన్ జువ్వలదిన్నె పర్యటించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని ఫిషింగ్ హార్బర్ లను దుర్మార్గంగా ప్రైవేటీకరణ చేస్తున్నారు. మా హయాంలో నాలుగు పోర్టులు, 10 హార్బర్ లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు పనులు చేపట్టాం . దాదాపు 26 వేల కోట్ల పెట్టుబడులతో వీటి పనులకు శ్రీకారం చుట్టాం. రెండేళ్లుగా మేము ప్రారంభించిన పోర్టులు హార్బర్లు పనులు జరగడం లేదని జగన్ అన్నారు. జువ్వలదిన్నె హార్బర్ పనులు పూర్తి చేసి ఎన్నికల ముందు ప్రారంభించాం. ఎన్నికల తరువాత ప్రధాని నరేంద్రమోదీ సైతం వర్చువల్ గా ఈ హార్బర్ ను ప్రారంభించారని జగన్ అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మత్స్యకారులకు ఏనాడూ మంచి చేసే ఆలోచన చేయలేదు. చంద్రబాబు ఎలాగూ చెయ్యలేదు.. కనీసం జగన్ చేసిన వాటిని అయినా వాళ్లకి దక్కకుండా చేస్తున్నాడు. ప్రధాని జాతికి అంకితం చేసి ఏడాదిన్నర అయింది. మత్స్యకారులకు ఎందుకు హ్యాండోవర్ చేయలేదని జగన్ ప్రశ్నించారు. ఈ హార్బర్ ను నమ్ముకుని 25వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఈ హార్బర్ లో 1255 బోట్లు నిలిపేలా నిర్మాణం చేశాం. అవికూడా ప్రభుత్వం ఇవ్వాలని మా హయాంలో నిర్ణయం తీసుకున్నాం.వైసీపీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈపాటికి ఇక్కడ మత్స్యకారులకు బోట్లు అందేవి. హార్బర్ కన్నులపండుగగా నడిచేది. మత్స్యకారులు సంతోషంగా ఉండేవారని జగన్ అన్నారు. అలాంటి హార్బర్ ను చంద్రబాబు ప్రైవేట్ డిపెన్స్ ఫ్యాక్టరీకి భూములు కేటాయించారు. అంతకీ ప్రైవేట్ కంపెనీకి ఇవ్వాలంటే కృష్ణపట్నం పోర్టు దగ్గర ఇచ్చుకో అంటూ జగన్ చంద్రబాబుకు సూచించారు. ఒకవేళ ఎవరికైనా ఇచ్చినా మా ప్రభుత్వం వచ్చాక తిరిగి తీసుకుంటాం. హార్బర్లు మత్స్యకారుల సొత్తు. చంద్రబాబు కాదుకదా ఆయన తాత వచ్చిన ఎవరు ఆపలేరు. రాష్ట్రంలో హార్బర్లు అన్ని మత్స్యకారుల సంపదేనని జగన్ అన్నారు.
తమిళనాడు బోట్లను మన మత్స్యకారులు పట్టుకుంటే.. వీళ్ళు వెనక్కి ఇచ్చేసారు. బోట్లు సీన్ చేసి fir చేసిన బోట్లను ప్రభుత్వ పెద్దలే దొంగతనం చేశారు.
బీదా సోదరులు మత్స్యకారులను బెదిరించి వెనక్కి ఇచ్చేశారు. కొందరు మత్స్యకారులకు డబ్బులిచ్చి దొంగతనం చేశారు. ఇంత వరకూ ఒక్కరిని కూడా అరెస్టు ఎందుకు చేయలేదని జగన్ ప్రశ్నించారు. కొందరు పోలీసులను బదిలీ చేసి వదిలేశారు. సీఎం కొడుకు మార్చి 12న వచ్చి దొంగతనం చేసుకోండి అని ఆశీస్సులు ఇచ్చాడు. మార్చి 16న బోట్లు దొంగతనం చేశారు. ఎల్లకాలం ఇదే ప్రభుత్వం కొనసాగదు.. ప్రజలు గట్టిగా బుధ్ది చెబుతారు అంటూ జగన్ హెచ్చరించారు.
