Ys Jagan-AP Highcourt : వైఎస్ జగన్‌కు ఏపీ హైకోర్టులో ఊరట దక్కేనా? పులివెందుల కేసుపై క్వాష్ పిటిషన్..!
Ys Jagan-AP Highcourt : మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందులలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. వైసీపీ ఎమ్మెల్సీల పిటిషన్లపైనా నేడు విచారణ జరగనుంది..
- Sreehari A
- Published on- November 10, 2026 / 11:31 AM IST
Ys Jagan-AP Highcourt
- ఏపీ హైకోర్టును ఆశ్రయించిన వైఎస్ జగన్
- పులివెందుల కేసుపై క్వాష్ పిటిషన్
- జగన్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ
Ys Jagan-AP Highcourt : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్‌తో పాటు వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు వేసిన పిటిషన్లు కూడా నేడు విచారణకు రానున్నాయి. దీంతో హైకోర్టు (Ys Jagan-AP Highcourt) విచారణపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది..
పులివెందుల కేసు ఏంటంటే? :
స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో నిరసన కార్యక్రమం చేపట్టారనే కారణంతో పులివెందులలో ఆయనపై కేసు నమోదైంది. అయితే, ఈ కేసును సవాల్ చేస్తూ జగన్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన కేసును రద్దు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు.
Read Also : EPS Pension Hike : పెన్షనర్లకు భారీ ఊరట.. ఇకపై నెలకు రూ.1,000 కాదు.. రూ.3 వేల పింఛను?
ఎమ్మెల్సీల పిటిషన్లపైనా విచారణ :
మరోవైపు వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు కూడా తమపై నమోదైన కేసులను కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించారు. ఎస్ఈసీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన ఘటనకు సంబంధించి వారిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లోనూ ఉపశమనం కోరుతూ ఎమ్మెల్సీలు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టు విచారణ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
