×
Ad

Ys Jagan: అందుకోసమే.. ప్రభుత్వ లిక్కర్ దుకాణాలు మూసేశారు.. ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒకటి కల్తీ- జగన్ సంచలన వ్యాఖ్యలు

వేలం పాట నిర్వహించి.. బెల్టు షాపులు వారి మనుషులకే అప్పగించారు. వీళ్లందరికీ మళ్లీ పోలీసుల నుంచి ప్రొటెక్షన్‌.

Ys Jagan: కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. దోచుకో, పంచుకో, తినుకో అన్నట్లుగా ఏపీలో పాలన నడుస్తోందన్నారు. చంద్రబాబుకు పాలనపై ధ్యాస లేదని, పూర్తిగా పాలన గాడి తప్పిందని ధ్వజమెత్తారు. ఏపీలో లిక్కర్ మాఫియా నడుస్తోందని ఆరోపించారు. కల్తీ లిక్కర్ కోసమే ప్రభుత్వ మద్యం దుకాణాలను మూసి వేశారని అన్నారు. ఇప్పుడు సీఎం మనుషులకే ప్రైవేట్ దుకాణాలు అప్పగించారని అన్నారు. క్వాలిటీ లేని లిక్కర్ తయారు చేసి ప్రైవేట్ మాఫియా నెట్ వర్క్ ద్వారా పంపిస్తున్నారని జగన్ అన్నారు. ఈ మాఫియాకు పోలీసులే రక్షణగా ఉంటున్నారని ఆయన ఆరోపించారు.

”రాష్ట్రంలో ఇప్పుడు కల్తీ లిక్కర్‌ మాఫియా నడుస్తోంది. దీని కోసం ప్రభుత్వ దుకాణాలను మూసేశారు. చంద్రబాబు, ఆయనకు సంబంధించిన మాఫియాకు ప్రైవేటు దుకాణాలు అప్పగించారు. వేలం పాట నిర్వహించి.. బెల్టు షాపులు వారి మనుషులకే అప్పగించారు. వీళ్లందరికీ మళ్లీ పోలీసుల నుంచి ప్రొటెక్షన్‌. ఎమ్మెల్యేకు ఇంత, పోలీసులకు ఇంత, పైనున్న పెదబాబుకు ఇంత, చినబాబుకు ఇంత అని పంచుకుంటున్నారు.

డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ను మొత్తం చేతుల్లోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఇల్లీగల్‌గా ఆదాయాలు పెంచుకోవడానికి తెరలేపారు. వీరికి సంబంధించిన షాపుల నుంచి తమకు కావాల్సిన వారికి మాత్రమే ఆర్డర్లు ఇస్తున్నారు. ఇదోరకం మాఫియా. ఇది కాక మరో రకం మాఫియా నడుపుతున్నారు. ఒక పద్ధతి ప్రకారం కల్తీ మద్యాన్ని పరిశ్రమ మాదిరిగా నడుపుతున్నారు.

క్వాలిటీ లేని లిక్కర్‌ను తయారు చేసి, తన ప్రైవేట్ మాఫియా నెట్‌వర్క్‌ ద్వారా నేరుగా పంపిస్తున్నారు. ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒక బాటిల్‌ కల్తీ బాటిల్‌. ఆ కల్తీ మద్యాన్ని తాగి మనుషులు చనిపోతున్నారు. ప్రాంతాల వారీగా కల్తీ దందా నడుపుతున్నారు. కల్తీ మద్యం తాగి అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇబ్రహీపట్నంలో భారీగా దొరికిన మద్యం, దాని తయారీకి సంబంధించిన వస్తువులు మాఫియా తీవ్రతను తెలియజేస్తున్నాయి” అని జగన్ అన్నారు.

Also Read: ‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ..’ రంగంలోకి జగన్.. ఇక సమరమే.. అక్టోబర్ 10 నుంచి..