Kakinada Tdp President Post: కాకినాడ జిల్లా టీడీపీ బాస్ ఎవరు? ఆ ఇద్దరు కాపు నేతల్లో పార్టీ పగ్గాలు దక్కేదెవరికి?

ఇటు జ్యోతుల అటు తోట రెండు కుటుంబాలకు కాకినాడ జిల్లాలో పెద్ద బంధువర్గమే ఉంది. అయితే ఇప్పటికే అధ్యక్షుడిగా కొనసాగుతుండటం..గతంలో జడ్పీ ఛైర్మన్‌గా పనిచేసిన అనుభవం జ్యోతుల నవీన్‌కు ప్లస్ పాయింట్‌గా చెప్తున్నారు.

Kakinada Tdp President Post: కాకినాడ జిల్లా టీడీపీ బాస్ ఎవరు? ఆ ఇద్దరు కాపు నేతల్లో పార్టీ పగ్గాలు దక్కేదెవరికి?

Updated On : December 5, 2025 / 9:36 PM IST

Kakinada Tdp President Post: గోదావరి గట్టున పాలిటిక్స్‌ సమ్‌థింగ్‌ డిఫరెంట్. ఏ పార్టీ పదవి అయినా.. అక్కడ హాట్‌ కేకే. పైగా అటు టీడీపీ, ఇటు జనసేన రెండు పార్టీల బలంగా ఉన్న జిల్లా కావడంతో.. సీనియారిటీ, క్యాస్ట్‌ ఈక్వేషన్స్ పని చేస్తాయి. ఇలా ఎంతో వడపోత తర్వాతే పార్టీ పదవులైనా.. ప్రభుత్వంలో అయినా కీలక పదవులు దక్కుతుంటాయి. ఇప్పుడు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్ష పోస్ట్ రేసు కూడా ఆసక్తికరంగా మారింది. ఆల్రెడీ డిస్ట్రిక్ ప్రెసిడెంట్‌గా ఉన్న ఓ నేతే మళ్లీ రేసులో ఉన్నారు. అదే సామాజికవర్గానికి చెందిన మరో నేత ఒక్క ఛాన్స్ అంటూ లాబీయింగ్ స్పీడప్ చేశారట. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఆ ఇద్దరిలో అధ్యక్ష పగ్గాలెవరికి?

గోదావరి జిల్లాల్లో కాకినాడ అత్యంత కీలకమైన జిల్లా. కూటమిలోని రెండు పార్టీలకు అత్యంత బలమైన జిల్లా. ఒక పక్క టీడీపీ మరోపక్క జనసేన..రెండు పార్టీల నుంచి కీలకమైన నేతలు కాకినాడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సొంత జిల్లా. అలాంటి జిల్లాలో టీడీపీ అధ్యక్ష పదవి అత్యంత కీలకంగా మారింది. ఇటు టీడీపీని అటు జనసేన క్యాడర్‌ను రెండు వర్గాలను కలుపుకొని వెళ్లే నేతకే సారధిగా అవకాశం దక్కనుంది. ఈ నేపథ్యంలో కాకినాడ టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి ఎవరిని వరించబోతుందనేది ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడిని కొనసాగిస్తారా లేక కొత్త వారికి అవకాశం ఇస్తారా అన్న డౌట్స్ వ్యక్తం అవుతున్నాయి.

మరోసారి జ్యోతుల నవీన్‌కే అవకాశం?

కాకినాడ జిల్లాలో కాపు సామాజిక వర్గ ప్రభావం ఎక్కువగా ఉంటుందనడంలో డౌట్‌ లేదు. కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి కచ్చితంగా కాపు సామాజిక వర్గం నేతలకు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో టీడీపీ డిస్ట్రిక్ ప్రెసిడెంట్ పోస్ట్ కోసం ఇద్దరు కాపు నేతలు పోటీ పడుతున్నారు. కూటమి అధికారంలోకి రానప్పటి నుంచి జ్యోతుల నవీన్ టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. జ్యోతుల నవీన్ జగ్గంపేట ప్రాంతానికి చెందినప్పటికీ గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా పనిచేశారు. జడ్పీ ఛైర్మన్‌గా పనిచేసిన అనుభవంతో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కాకినాడ టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి..పార్టీ యాక్టివిటీ చేయడంలో ముందుండే వారు. పైగా జిల్లావ్యాప్తంగా తనకు మంచి పరిచయాలు ఉన్నాయని చెప్తున్నారు. దీంతో మరోసారి జ్యోతుల నవీన్‌కే అవకాశం దక్కుతుందని చర్చ జరుగుతోంది.

జిల్లా అధ్యక్ష రేసులో అదే మెట్ట ప్రాంతానికి చెందిన తోట నవీన్ పేరు కూడా ఎక్కువగానే వినిపిస్తుంది. తోట నవీన్ గతంలో కిర్లంపూడి జడ్పీటీసీగా పని చేయగా..పార్టీ పరంగా కీలక పదవులు ఏమీ చేపట్ట లేదు. అయితే కాకినాడ జిల్లాలో టీడీపీ ఎంత బలంగా ఉంటుందో జనసేన కూడా అంతే స్ట్రాంగ్‌గా ఉంటుంది. రెండు పార్టీలను కలుపుకుని ముందుకు తీసుకెళ్లే నాయకుడు అయితే బాగుంటుందనేది తెలుగు తమ్ముళ్ల అభిప్రాయం. రెండు పార్టీల క్యాడర్‌ను..అసంతృప్తులను కలుపుకొని వెళ్లగలిగే సత్తా ఉన్న నేతకే పార్టీ పగ్గాలు దక్కే అవకాశం ఉంది. పార్టీ పరంగా టీడీపీ, జనసేన ఎంత బలంగా ఉన్నాయో..ప్రెసిడెంట్ రేసులో ఉన్న ఇద్దరు టీడీపీ నేతలుకు కూడా అంతో ఇంతో పట్టుంది.

ఇటు జ్యోతుల అటు తోట రెండు కుటుంబాలకు కాకినాడ జిల్లాలో పెద్ద బంధువర్గమే ఉంది. అయితే ఇప్పటికే అధ్యక్షుడిగా కొనసాగుతుండటం..గతంలో జడ్పీ ఛైర్మన్‌గా పనిచేసిన అనుభవం జ్యోతుల నవీన్‌కు ప్లస్ పాయింట్‌గా చెప్తున్నారు. తోట నవీన్‌కు కొందరు టీడీపీ పెద్దల ఆశీర్వాద బలంగా ఉండటంతో ఆయనకు అవకాశం ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు తెలుగు తమ్ముళ్లు. టీడీపీ అధిష్టానం మాత్రం కాకినాడ జిల్లా అధ్యక్ష పదవిపై తీవ్ర కసరత్తు చేసిందని..ఇప్పటికే జిల్లా అధ్యక్ష పగ్గాలు ఎవరికి అప్పగించాలనే దానిపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు టాక్.

Also Read: పండగే పండగ.. 2026లో ప్రభుత్వ సెలవులు ఇవే.. లిస్ట్ విడుదల చేసిన ఏపీ సర్కార్..