Pawan Kalyan: ఫైవ్ పాయింట్ ఫార్ములా..! సేనాని మాస్టర్ ప్లాన్..! కూటమిలో ఉంటూనే పవన్ కల్యాణ్ వ్యూహమేంటి?
పిఠాపురం నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా ఐదుగురు సభ్యులతో కమిటీ వేయగా..ఆ కమిటీ పనితీరును పరిశీలించాక..మిగతా అన్ని ప్రాంతాల్లో కమిటీలు వేయాలని పవన్ డిసైడ్ అయ్యారట.
Pawan Kalyan: కూటమిలో ఆయనే కీలకం. ముగ్గురు మంత్రులు, 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు. ఇప్పుడు ఆయన బలం ఇదే. రాబోయే రోజుల్లో రాజకీయంగా ఇంకా బలపడాలనుకుంటున్న సేనాని..తన సైన్యం బలాన్ని మరింత పెంచుకునే పనిలో పడ్డారు. అందుకోసం ఏకంగా ఫైవ్ పాయింట్ ఫార్ములా రెడీ చేశారట. గల్లీ టు ఢిల్లీ..లోకల్ టు లోక్‌సభ వరకు..పార్టీకి ఓ స్ట్రక్చర్ ఉండేలా కమిటీల ఏర్పాటుకు రెడీ అయ్యారట. కూటమిలో ఉంటూనే పవన్ వ్యూహమేంటి? ఇంకా బలపడేందుకా? ఇప్పుడున్న బలాన్ని కాపాడుకోనే ప్లానా?
అధికారంలో ఉన్నామని రిలాక్స్ అవడం లేదు. తాను పని చేస్తున్నారు. పార్టీని బలోపేతం చేయాలని కలలు కంటున్నారు. పది కాలాల పాటు జనసేన పార్టీ ఉండేలా.. స్పెషల్ మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నారట ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్. పార్టీకి బలమైన పునాదులు వేసే దిశగా..గ్రామ స్థాయి నుంచి లోక్‌సభ ఎంపీ వరకు..అన్ని స్థాయిల్లో బలమైన కమిటీల ఏర్పాటుకు మిషన్ స్టార్ట్ చేయబోతున్నారట.
ఫ్యూచర్ పాలిటిక్స్‌పై ఫోకస్..
కూటమిగా పవర్‌లోకి వచ్చి 15 నెలలు అయిపోతున్న టైమ్‌లో ఫ్యూచర్ పాలిటిక్స్‌పై ఫోకస్ పెట్టారు. తనతో సహా గెలిచిన 21 మంది ఎమ్మెల్యే సీట్లను, రెండు పార్లమెంట్ స్థానాలను తిరిగి నిలబెట్టుకోవడంతో పాటు..రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో క్యాడర్, లీడర్ల బలోపేతం కోసం స్పెషల్ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారట. గ్రామ, మండల, నియోజకవర్గాల వారీగా ఐదుగురు సభ్యులతో కూడిన ఫైవ్ మెన్ కమిటీలు వేసేందుకు సిద్ధమవుతున్నారట పవన్. ఈ కమిటీ ఇటు జనసేన పార్టీ కోసం పని చేయడంతో పాటు..అటు అభివృద్ధి కోసం తమవంతు ప్రయత్నం చేసేలా రూపకల్పన చేస్తున్నారట.
జనసేన క్యాడర్, లీడర్లు..పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. అభివృద్ధిలో, మౌలిక వసతుల ఏర్పాటులో క్రియాశీలకంగా పనిచేసేలా క్యాడర్, లీడర్లను మోటివేట్ చేస్తూ వస్తున్నారు పవన్. అందులో భాగంగా ఐదుగురు సభ్యుల కమిటీని తెరమీదకు తెచ్చారట. గ్రామ, మండల, శాసనసభ, లోక్‌సభ నియోజకవర్గాల స్థాయిల్లో ఐదుగురు సభ్యులతో కమిటీలు వేస్తామంటున్నారు. ఈ కమిటీ పార్టీ కార్యక్రమాల నిర్వహణతో పాటు అభివృద్ధి పనుల్లోనూ పాల్గొనేలా చేయాలని భావిస్తున్నారు. ప్రతి కమిటీలోనూ మహిళల ప్రాతినిధ్యం తప్పనిసరి అని, ఒకరు లేదా ఇద్దరు వీర మహిళలకు చోటు కల్పించాలని అనుకుంటున్నారు.
ప్రయోగాత్మకంగా పిఠాపురంలో ప్రారంభం..
పిఠాపురం నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా ఐదుగురు సభ్యులతో కమిటీ వేయగా..ఆ కమిటీ పనితీరును పరిశీలించాక..మిగతా అన్ని ప్రాంతాల్లో కమిటీలు వేయాలని పవన్ డిసైడ్ అయ్యారట. సేమ్‌టైమ్ పార్టీ అంతర్గత వ్యవహారాలు, వివాదాల పరిష్కరానికి కూడా..కాన్‌ఫ్లిక్ట్ మేనేజ్‌మెంట్ వింగ్‌ను కూడా ఏర్పాటు చేయబోతున్నారట.
పైలెట్ ప్రాజెక్టుగా మొదట ఐదుగురు సభ్యుల కమిటీని పిఠాపురం నుంచి ప్రారంభించారు. పిఠాపురంలో ఆరు నెలల పాటు పరిస్థితులను గమనించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఇదే విధంగా పార్టీని బలోపేతం చేసేందుకు నేతలకు ప్రత్యేక బాధ్యతలను అప్పచెప్పినట్లు సమాచారం. పిఠాపురం మోడల్‌ను త్వరలో మిగతా నియోజకవర్గాల్లో కూడా అమలు చేయబోతున్నారట. ఫ్యూచర్ బేస్డ్ పొలిటికల్ ప్లాన్స్‌లో భాగంగా పార్టీ స్ట్రక్చర్‌పై పవన్ పెడుతున్న ఫోకస్ ఇంట్రెస్టింగ్‌గా మారింది. పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్న ఆయన..తన సీటును పదిలం చేసుకునేందుకు పార్టీకి బలమైన పునాదులు వేసేలా ప్లాన్ స్టార్ట్ చేశారట.
అంతేకాదు గోదావరి జిల్లాలను తన రాజకీయ క్షేత్రానికి కేంద్రంగా మార్చుకునేలా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న బలం చెక్కుచెదరకుండా ఉండాలంటే..భవిష్యత్‌లో పార్టీ ఇంకా బలపడి ఎదగాలంటే..ప్రజలకు మరింత దగ్గర కావాలన్నది పవన్ వ్యూహమంటున్నారు. అందుకే ఫైవ్ మెన్ కమిటీలను ఏర్పాటు చేసే ఆలోచనకు శ్రీకారం చుట్టారట. పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దేందుకు మాస్టర్ స్కెచ్ రెడీ చేస్తున్నారట పవన్. పంచసూత్ర ద్వారా పవన్ పార్టీని ఎలా బలోపేతం చేస్తారో..ఆ కమిటీలు పార్టీ యాక్టివిటీని, డెవలప్‌మెంట్‌ను ఎలా బ్యాలెన్స్ చేస్తాయో చూడాలి.
Also Read: అమరావతి ఇక అన్‌స్టాపబుల్..! ఫలించిన చంద్రబాబు ప్రయత్నాలు..! కొత్త ఏడాదిలో గెజిట్ విడుదల?
