YS Jagan: ‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ..’ రంగంలోకి జగన్.. ఇక సమరమే.. అక్టోబర్ 10 నుంచి..

ప్రతి నియోజకవర్గ సమన్వయకర్త ప్రతిరోజూ రెండు గ్రామాలు సందర్శించాలి. అలాగే నియోజకవర్గాల్లో రౌండ్‌ టేబుల్స్‌ ద్వారా చైతన్యపరిచే కార్యక్రమాలు నిర్వహించాలి.

YS Jagan: ‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ..’ రంగంలోకి జగన్.. ఇక సమరమే.. అక్టోబర్ 10 నుంచి..

YS Jagan

Updated On : October 7, 2025 / 5:26 PM IST

Ys Jagan: ఏపీలో రాజకీయాలు మరింత హీటెక్కాయి. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ అంశం చుట్టూ పాలిటిక్స్ నడుస్తున్నాయి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ వ్యవహారంలో కూటమి ప్రభుత్వంతో ఫైట్ చేసేందుకు వైసీపీ చీఫ్ జగన్ రంగంలోకి దిగనున్నారు.

అక్టోబర్ 9న నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శిస్తానని జగన్ చెప్పారు. అక్టోబర్ 10 నుంచి నవంబర్‌ 22 వరకు రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణపై కరపత్రాలు పంపిణీ చేస్తామన్నారు. రచ్చబండ కార్యక్రమాల ద్వారా కోటి సంతకాలను సేకరించనున్నారు. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కనీసం ప్రతి పంచాయతీ నుంచి 500 మందితో సంతకాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ప్రతి నియోజకవర్గ సమన్వయకర్త ప్రతిరోజూ రెండు గ్రామాలు సందర్శించాలి. అలాగే నియోజకవర్గాల్లో రౌండ్‌ టేబుల్స్‌ ద్వారా చైతన్యపరిచే కార్యక్రమాలు నిర్వహించాలి. అక్టోబర్ 28న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు ఉంటాయి. నియోజకవర్గ స్థాయిలో ఉన్న అధికారికి డిమాండ్‌ పత్రాలు సమర్పించనున్నారు. జిల్లా కేంద్రాల్లో నవంబర్‌ 12 న ర్యాలీలు ఉంటాయన్న జగన్.. ఒక జిల్లాలో తాను కూడా పాల్గొంటానని తెలిపారు.

నవంబర్‌ 23న నియోజకవర్గ కేంద్రాల నుంచి సేకరించిన సంతకాలు జిల్లా కేంద్రానికి తరలిస్తామన్నారు. నవంబర్ 24న సేకరించిన సంతకాలతో కూడిన వాహనాలను జిల్లా కేంద్రంలో జెండా ఊపి విజయవాడకు పంపుతామన్నారు. సేకరించిన ఈ సంతకాలు గవర్నర్‌కి అప్పగించే కార్యక్రమం తదుపరి జరుగుతుందన్నారు జగన్.

Also Read: తప్పు చేస్తే ఒప్పేదే లే.. ఏపీ నకిలీ లిక్కర్‌ కేసులో ట్విస్ట్ ఏంటి? సెగలు కక్కుతున్న కేసు వ్యవహారం