YS Jagan: కర్నూలు జైలు వద్ద వైఎస్ జగన్.. ఎమ్మెల్యే విరూపాక్షికి పరామర్శ.. రెడ్ బుక్ రాజ్యాంగంపై తీవ్ర ఆగ్రహం

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌ (YS Jagan)ఇటీవలే అరెస్ట్ అయి జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించి, ఆయనకు అండగా ఉంటామని భరోసానిచ్చారు.

Ys jagan visits kurnool jail to meet ycp mla virupakshi

  • జైలులో ఎమ్మెల్యేను పరామర్శించిన జగన్
  • రెడ్ బుక్ రాజ్యాంగంపై మండిపాటు
  • పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం

YS Jagan: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవలే అరెస్ట్ అయి జైలులో ఉన్న ఆలూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించి, ఆయనకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. జగన్ రాక సందర్భంగా జైలు పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా బారికేడ్లను ఏర్పాటు చేయగా, వైఎస్సార్‌సీపీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆ బారికేడ్లను తోసుకుంటూ జైలు గేటు వరకు చేరుకోవడంతో అక్కడ కాసేపు తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది.

Strait Of Hormuz: ‘హార్ముజ్’ మా ఆధీనంలోనే ఉంది.. వాళ్లకి నో ఎంట్రీ.. ట్రంప్‌కు ఇరాన్ సాలిడ్ కౌంటర్

రాత్రివేళ దొంగల్లా వచ్చి ఎమ్మెల్యేను అపహరించారు:

అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్(YS Jagan), ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబు డైరెక్షన్‌లో ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ నడుస్తోందని ఆరోపించారు. అర్థరాత్రి 2:45 గంటల సమయంలో వందల మంది పోలీసులు దొంగల్లా, బందిపోటు ముఠాలా వచ్చి ఎమ్మెల్యే విరూపాక్షి ఇంటి డోర్లు, సీసీ కెమెరాలను ధ్వంసం చేసి ఆయనను తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పగటిపూట నోటీసులు ఇస్తే రాని ఉగ్రవాదా ఆయన అని ప్రశ్నించారు. బాధితుడే నిందితుడిగా మారే దారుణ పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని, ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని జగన్ మండిపడ్డారు.

కార్యకర్తను కాపాడేందుకు వెళ్తే ఎస్సీ, ఎస్టీ కేసా?:

సంగాల గ్రామంలో దాడికి గురవుతున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్త గిరిని కాపాడటానికి మానవత్వంతో వెళ్లిన ఎమ్మెల్యే విరూపాక్షిపై కావాలనే కుట్రపూరితంగా కేసులు పెట్టారని జగన్ స్పష్టం చేశారు. బాధితులకు రక్షణ కల్పించడంలో స్థానిక పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని, దాడిలో ఎమ్మెల్యే తమ్ముడి చేయి విరిగినా కూడా వారినే నిందితులుగా చేశారని మండిపడ్డారు. చివరికి ఒక టీడీపీ కార్యకర్త తన భార్య బట్టలు తానే చించి, ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించారని, దీనికి సంబంధించిన వీడియోలు కూడా బయటపడ్డాయని చెబుతూ.. ప్రజాస్వామ్యవాదులందరూ ఈ అక్రమాలపై ఆలోచించాలని జగన్ పిలుపునిచ్చారు.