YS Sharmila: సాయిరెడ్డికి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ జగనే.. ఇప్పటికైనా ఆ నిజాలన్నీ బయటపెట్టు.. షర్మిల డిమాండ్

వైసీపీని ఆయన వీడారంటే చిన్న విషయం కాదని చెప్పారు.

Vijayasai Reddy, YS Sharmila

రాజకీయాల నుంచి వైదొలుగుతూ రాజ్యసభ తాజా మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీసుకున్న నిర్ణయంపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్‌ చేశారు. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌కు చెప్పకుండా విజయసాయి రెడ్డి ఏమీ చేయరని ఆమె అన్నారు. విజయసాయి రెడ్డి గతంలో ఎన్నో అసత్యాలు చెప్పారని అన్నారు. ఇప్పుడయినా ఆయన నిజాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

తన కుటుంబం, తన పిల్లల మీద విజయసాయిరెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని షర్మిల తెలిపారు. వైసీపీని ఆయన వీడారంటే చిన్న విషయం కాదని చెప్పారు. జగన్‌ను విజయసాయిరెడ్డి వంటి వారే వదిలేస్తున్నారంటే ఆలోచన చేయాలని వ్యాఖ్యానించారు. ఒక్కొక్కరుగా జగన్‌ను వదిలి బయటకు వస్తున్నారని చెప్పారు. జగన్ నాయకుడిగా ఓడిపోయారని, విశ్వసనీయతను కోల్పోయారని అన్నారు.

Vijaysai Reddy: రాజీనామా చేస్తానంటే జగన్ ఒకే ఒక మాటన్నారు: విజయసాయిరెడ్డి

“అందుకే జగన్‌ నా అనుకున్న వారంతా వెళ్లిపోతున్నారు” అని వైఎస్‌ షర్మిల వ్యాఖ్యానించారు. బీజేపీకి, ప్రధాని నరేంద్ర మోదీకి జగన్ దత్త పుత్రుడని విమర్శించారు. ఇంతకాలం విజయసాయిరెడ్డిని బీజేపీ దగ్గర ఉంచే కేసుల విచారణ సాగకుండా చేశారని జగన్‌పై ఆరోపణలు చేశారు.

ఇప్పుడు జగన్ విశ్వసనీయతను కోల్పోయారని షర్మిల తెలిపారు. వివేకా కేసులో కూడా జగన్ చెప్పమన్న విధంగా అసత్యాలు చెప్పారని వైఎస్ షర్మిల అన్నారు. విజయసాయిరెడ్డి అన్నీ నిజాలు చెబితే ప్రజలు ఇప్పుడయినా హర్షిస్తారని చెప్పారు.

ఇదేందిది..! భర్తలు తాగుబోతోళ్లని.. ఇద్దరు భార్యలు ఒకరినొకరు పెళ్లి చేసుకున్నారు..