ఏపీ సర్కార్ అభయం : మరో 6 జిల్లాలో YSR AROGYA SRI..ప్రారంభించనున్న సీఎం జగన్

  • Publish Date - July 16, 2020 / 09:05 AM IST

వైద్యం ఖర్చు వేయి రూపాయలు దాటితో ఆరోగ్య శ్రీ వర్తింపు పథకం నేటి నుంచి 6 జిల్లాలకు (Kadapa, Kurnool, Prakasam, Guntur, Vizianagaram, Visakhapatnam) విస్తరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్‌ 2020, July 16వ తేదీ గురువారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు క్యాంపు కార్యాలయంలో ప్రారంభిస్తారు.

2, 200 వైద్య ప్రక్రియలు : – 
కరోనాను కూడా ఆరోగ్య శ్రీలో చేర్చడంతో.. మొత్తం 2,200 వైద్య ప్రక్రియలకు ఆరోగ్య శ్రీ వర్తించనుంది. గతంలో 1059 రోగాలకే ఆరోగ్య శ్రీ వర్తించేది. జగన్‌ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మిగతా రోగాలను కూడా ఆరోగ్య శ్రీలో చేర్చారు. అంతేకాదు.. గత ప్రభుత్వం ఆస్పత్రులకు పెట్టిన బకాయిలనూ వైసీపీ ప్రభుత్వం చెల్లించింది. గత ఏడాది జూన్‌ నుంచి 1815కోట్లు చెల్లించింది.

వైద్య పరీక్షలు రూ. 1000 దాటితే : – 
ఉద్యోగుల ఆరోగ్య పథకంలో మరో 315 కోట్లు చెల్లించింది.
వైద్య పరీక్షలు రూ. 1000 దాటితే..ఆరోగ్య శ్రీ పరిధిలోకి తెస్తామని ఎన్నికల సమయంలో జగన్ హామీనిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో పలు మార్పులు చేస పైలట్ ప్రాజెక్టుగా దీనిని జనవరి 03వ తేదీ నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.

పథకంలో మార్పులు : – 
ఆరోగ్య శ్రీలో గతంలో 1059 రోగాలకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత…మొత్తం 2 వేల 59 వ్యాధులను ఈ పథకంలోకి చేర్చింది. పథకంలో మార్పులు చేస్తూ…మరింత పటిష్టంగా పథకం అమలు చేసేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ క్రమంలో పథకం కింద వైద్య చికిత్సలను 2 వేల 146కి పెంచారు. అనంతరం సంపూర్ణ క్యాన్సర్ చికిత్స కోసం మరో 54 వైద్య ప్రక్రియలు చేర్చారు. దీంతో ఆరోగ్య శ్రీ పథకం కింద అందించే వైద్య ప్రక్రియల సంఖ్య మొత్తం 2 వేల 200కి చేర్చింది.

ట్రెండింగ్ వార్తలు