YSRCP demands strictest punishment for the accused TDP leader
Andhra: లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న తెలుగు దేశం పార్టీ నేతపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ బుధవారం డిమాండ్ చేసింది. అలాగే బాధితిరాలికి, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని పేర్కొంది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో ఉన్న ఎర్రబల్లి అనే గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలికపై స్థానిక టీడీపీ నేత లైంగిక అఘాయిత్యానికి పాల్పడ్డట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో వైసీపీ పై విధంగా స్పందించింది.
ఇక ఈ విషయమై రాష్ట్ర మహిళా కమిషన్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. సత్యసాయి జిల్లా ఎస్పీతో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడారు. దర్యాప్తు వేగవంతం చేసి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతే కాకుండా అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో టీడీపీ నేతలు వరుస లైంగిక వేధింపులకు పాల్పడుతుంటే వారిని టీడీపీ అధినేత చంద్రబాబు వెనకేసుకురావడం ఏంటని అసంతృప్తి వ్యక్తం చేశారు.
విజయవాడ వినోద్ జైన్ కేసు సమయంలోనే వారి పార్టీ నేతలకు చంద్రబాబు బుద్ధి చెప్పి ఉండాల్సిందని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఇలాంటి వాటిని ఎంతమంత్రి సహించరని, మహిళా కమిషన్ సైతం సహించే ప్రసక్తే లేదని, కీచక పరులకు తగిన గుణపాఠం తప్పదని వాసిరెడ్డి హెచ్చరించారు.
Indrakeeladri Temple : ఇంద్రకీలాద్రిపై తప్పిన పెను ప్రమాదం, భయంతో పరుగులు తీసిన భక్తులు