Indrakeeladri Temple : ఇంద్రకీలాద్రిపై తప్పిన పెను ప్రమాదం, భయంతో పరుగులు తీసిన భక్తులు

ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిలో పెను ప్రమాదం తప్పింది. నిన్నటి నుంచి విజయవాడలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తుండటంతో అమ్మవారి సన్నిధిలోని రావిచెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి.

Indrakeeladri Temple : ఇంద్రకీలాద్రిపై తప్పిన పెను ప్రమాదం, భయంతో పరుగులు తీసిన భక్తులు

Indrakeeladri Temple : ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిలో పెను ప్రమాదం తప్పింది. నిన్నటి నుంచి విజయవాడలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తుండటంతో అమ్మవారి సన్నిధిలోని రావిచెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి. భక్తులు, భవానీ మాలధారులు అమ్మవారిని దర్శించుకుని ముడుపులు కడుతుండగా, భారీ శబ్దంతో ఒక్కసారిగా చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడున్న వారంతా భయంతో పరుగులు తీశారు.

విషయం తెలిసిన వెంటనే దుర్గగుడి సిబ్బంది రంగంలోకి దిగారు. చెట్టు కొమ్మలు తొలగించే పనిలో పడ్డారు. అటు దర్శనానికి ఇబ్బందులు కలగకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు అధికారులు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరక్కపోవడంతో భక్తులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

మాల విరమణ చేసేందుకు భక్తులు దుర్గమ్మ గుడికి పోటెత్తారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షం కారణంగా ఇంద్రకీలాద్రి పైభాగాన అమ్మవారి సన్నిధానాన ఉండే రావిచెట్టి ఒక భాగం నేలకు ఒరిగింది. పెద్ద శబ్దంతో చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి. అయితే ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. అమ్మవారి సన్నిధిలో పూజలు చేసిన తర్వాత భక్తులు నేరుగా రావి చెట్టు దగ్గరికి వస్తారు. ఈ చెట్టుకి వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. చెట్టు దగ్గర భక్తులు పూజలు చేస్తారు. పసుపు, కుంకుమ, సారె సమర్పిస్తారు. అయితే ఇవాళ ఒక్కసారిగా చెట్టు కొమ్మలు భారీ శబ్దంతో విరిగిపడటం కొంత భయాందోళనకు గురి చేసింది.

వెంటనే రంగంలోకి దిగిన ఆలయ సిబ్బంది.. చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. అటువైపుగా ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. దర్శనానికి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. అదే సమయంలో విరిగిపడిన చెట్టు కొమ్ములు తొలగించే పనిని ముమ్మరం చేశారు. కాగా, ఈ రావి చెట్టుకు వందేళ్ల చరిత్ర ఉంది. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత భవానీలు, భక్తులు ఈ చెట్టుకు పూజలు చేస్తారు. అమ్మవారి అనుగ్రహం తమపై ఉండాలని కోరుకుంటారు.