AP: వైసీపీకి మరో బిగ్ షాక్.. మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌ జకియా ఖానమ్ రాజీనామా

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి చెందిన మరో ఎమ్మెల్సీ రాజీనామా చేశారు.

YSRCP MLC Resignation Zakia Khanam

AP: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి చెందిన మరో ఎమ్మెల్సీ రాజీనామా చేశారు. ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్ పర్సన్ జకియా ఖానమ్ పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తూ మండలి చైర్మన్ కు లేఖ రాశారు.

Also Read: Pawan Kalyan: పెద్దిరెడ్డికి బిగ్ షాక్…! భూ ఆక్రమణల వ్యవహారంలో పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..

అధికారం కోల్పోయిన నాటినుంచి వైసీపీకి రాజీనామా చేస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వారిలో కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, జయమంగళ వెంకట రమణ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్ ఉన్నారు. తాజాగా.. ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్ పర్సన్ జాకియా ఖానమ్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.

జాకియా ఖానమ్ 2020 జులైలో ఎమ్మెల్సీగా గవర్నర్ నామినేట్ చేశారు. ఆమెది అన్నమయ్య జిల్లా రాయచోటి. కొద్దికాలంగా ఆమె వైసీపీలో అసంతృప్తిగా ఉంటున్నట్లు సమాచారం. ఈ కారణంగానే రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.