Pawan Kalyan: పెద్దిరెడ్డికి బిగ్ షాక్…! భూ ఆక్రమణల వ్యవహారంలో పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..

పెద్దిరెడ్డి కుటుంబం అటవీ భూములు ఆక్రమించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

Pawan Kalyan: పెద్దిరెడ్డికి బిగ్ షాక్…! భూ ఆక్రమణల వ్యవహారంలో పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..

Updated On : May 14, 2025 / 12:44 AM IST

Pawan Kalyan: వైసీపీ సీనియర్ నేత, మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం భూముల వ్యవహారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు ఇచ్చారు. అటవీ, ప్రభుత్వ, బుగ్గ మఠం భూముల ఆక్రమణ వ్యవహారంలో మాజీమంత్రి పెద్దిరెడ్డి కుటుంబసభ్యులపై కేసులు నమోదు చేయాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. అలాగే ఈ భూములను రక్షించలేని అధికారులపైనా చర్యలు తీసుకోవాలని, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పవన్ కల్యాణ్ ఆదేశాలిచ్చారు. భూముల ఆక్రమణలపై విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీ ఇచ్చిన నివేదికను పవన్ కల్యాణ్ పరిశీలించారు. డీజీ సిఫార్సులకు అనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు.

చిత్తూరు జిల్లాలో అటవీ, ప్రభుత్వ, బుగ్గ మఠం భూముల ఆక్రమణలపై వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీ విచారణ జరిపి పవన్ కల్యాణ్ కు నివేదిక ఇచ్చారు. పెద్దిరెడ్డి భూముల వ్యహారంపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీ నివేదికను పవన్ పరిశీలించారు. అటవీ భూముల ఆక్రమణలకు సంబంధించిన అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో చర్చించారు.

విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీ సిఫార్సులకు అనుగుణంగా చర్యలకు ఉపక్రమించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు పవన్‌ కల్యాణ్‌. అటవీ భూములను సంరక్షించలేకపోయిన అధికారులను గుర్తించి నివేదిక రూపొందించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూములు ఆక్రమించిన వారిపైనా క్రిమినల్ కేసులతో పాటు, అటవీ పర్యావరణ చట్టాలను అనుసరించి కేసులు నమోదు చెయ్యాలన్నారు.

Also Read: ఏపీ లిక్కర్ కేసు.. అరెస్ట్ భయంతో వణికిపోతున్న ఉన్నతాధికారులు..

పెద్దిరెడ్డి కుటుంబం అటవీ భూములు ఆక్రమించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రభుత్వం చేపట్టిన విచారణలోనూ ఇదే తేలిందని సమాచారం. ఈ వ్యవహారంలో పెద్దిరెడ్డి కుటుంబీకులపై ప్రభుత్వం క్రిమినల్ చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది. అదే సమయంలో భూములు ఆక్రమణలకు గురవుతుంటే రక్షించ లేని వారిని బాధ్యులను చేయనున్నారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోనుంది ప్రభుత్వం. అదే విధంగా ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నివేదికలో సిఫార్సు చేశారు. దాంతో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదయ్యే ఛాన్స్ ఉంది.

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం చిత్తూరు జిల్లాలో అటవీ, ప్రభుత్వ, బుగ్గ మఠం భూముల ఆక్రమించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌ను ప్రభుత్వం ఆదేశించింది. విచారణ జరిపిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ.. మంగళవారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు నివేదిక అందజేశారు.