అరెస్ట్ భయంతో వణికిపోతున్న ఆ ఉన్నతాధికారులు.. ఏం జరుగుతోంది?

ఇక అరెస్ట్ కాక తప్పదేమో అన్న చర్చ వారిలో మొదలైందట.

అరెస్ట్ భయంతో వణికిపోతున్న ఆ ఉన్నతాధికారులు.. ఏం జరుగుతోంది?

Supreme Court

Updated On : May 12, 2025 / 9:02 PM IST

ఏపీ లిక్కర్ కేసు ఇంకా కొంతమందిని వెంటాడుతోందా? గత ప్రభుత్వంలో పనిచేసిన ఉన్నతాధికారులు అరెస్ట్ భయంతో వణికిపోతున్నారా? అందుకే అడ్రస్ లేకుండా అజ్జాతంలోకి వెళ్లిపోయారా? ఆ ముగ్గురు ఉన్నతాధికారుల్లో మే 13 టెన్షన్ పట్టుకుందా? ముందస్తు బెయిల్ పిటిషన్లపై రేపు సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది?

ఒకవేళ సుప్రీంకోర్టులో చుక్కెదురైతే పరిస్థితి ఎంటన్నది ఆ ముగ్గురిలో టెన్షన్ పుట్టిస్తోందా? ఇప్పుడివే ప్రశ్నలు గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన ఆ ముగ్గురు ఉన్నతాధికారులను వేధిస్తున్నాయంట. ఇంతకీ అజ్జాతంలో ఉన్న ఆ ముగ్గురు అధికారులు ఎవరు? అంతలా ఎందుకు టెన్షన్ పడుతున్నారు? లిక్కర్ స్కాంకు వారికి సంబంధం ఏంటి? వాచ్ దిస్ స్టోరీ.

ఏపీ లిక్కర్ స్కాం కేసులో సిట్ దూకుడు పెంచింది. దీంతో అప్పటినుంచి గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన కొంతమంది ఉన్నతాధికారులు అరెస్ట్ భయంతో వణికిపోతున్నారు. కేసులో A-31గా ఉన్న ధనుంజయ రెడ్డి, A-32 కృష్ణ మోహన్ రెడ్డి, A-33 బాలాజీ గోవిందప్పలు అజ్జాతంలోకి వెళ్లిపోవడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. గత వైసీపీ ప్రభుత్వంలో సీఎంవోలో కీలకంగా పనిచేసిన ధనుంజయ్ రెడ్డి సైతం చట్టం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపణలు విన్పిస్తున్నాయి.

Also Read: జీవన్ రెడ్డికి దామోదర ఫుల్ సపోర్ట్..? అందుకేనా?

సిట్ విచారణకు హజరు కాకుండా వీరంతా తప్పించుకుని తిరుగుతున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. సిట్ అధికారులు ఎన్నిసార్లు నోటీసులు జారీచేసినా..వీరు ముగ్గురి నుంచి మాత్రం స్పందన రావడంలేదు. పరారీలో ఉంటూ సిట్ విచారణకు హాజరుకాకుండా డుమ్మా కొడుతుండడంతో వీరిని అరెస్ట్ చేసేందుకు సిట్ అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. అయినా వీరి ఆచూకీ మాత్రం సిట్ అధికారులకు అంతుచిక్కడంలేదు. అడ్రస్ దొరక్కుండా తప్పించుకుతిరుగుతున్న వీరిపై నిఘాను మరింత ముమ్మరం చేశారు సిట్ అధికారులు.

వైసీపీ హయాంలో సీఎంవో కార్యదర్శిగా పనిచేసిన ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డితో పాటు జగన్ పీఏ కృష్ణమోహన్ రెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలను సిట్ అధికారులు ఇప్పటికే నిందితులుగా చేర్చారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో దాదాపు 3,200 కోట్లు చేతులు మారినట్లు సిట్‌ ప్రాథమికంగా ఆధారాలు సేకరించింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన కీలక నిందితులు రాజ్‌ కేసిరెడ్డి, సజ్జల శ్రీధర్‌ రెడ్డితో పాటు మరికొందరి స్టేట్‌మెంట్​ఆధారంగానూ సిట్‌ సమాచారం సేకరించింది.

అయితే రిమాండ్ రిపోర్టుల్లో ఈ ముగ్గురి పేర్లను నమోదు చేసినప్పటి నుంచి ధనుంజయరెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, గోవిందప్ప అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అంతేకాదు…తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖాలు చేశారు. వీరి పిటిషన్​ను విచారించిన ధర్మాసనం ఆ పిటీషన్​ను కొట్టేసింది. సుప్రీంకోర్టులో కూడా అరెస్టు నుంచి వీరికి ఎలాంటి మధ్యంతర బెయిల్ లభించలేదు.

సుప్రీంకోర్టులో వీరికి చుక్కెదురైతే?
అయితే గతంలో వేసిన పిటిషన్‌‌ను సవరణ చేయాలని లేదా కొత్త పిటిషన్‌ను వేయాలని సుప్రీంకోర్టు తెలియజేస్తూ విచారణను ఈనెల 13కు వాయిదా వేసింది. దీంతో మే 13న ఏం జరగబోతుందన్న టెన్షన్ ఈ ముగ్గురిని వెంటాడుతోంది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే వెలుగులోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ సుప్రీంకోర్టులో వీరికి చుక్కెదురైతే..ఇక వీరి అరెస్ట్ కు లైన్ క్లియర్ అయినట్లే అన్న అభిప్రాయాలు రాజకీయవర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.

ఏపీ లిక్కర్ పాలసీ రూపకల్పన, ఏ స్థాయిలో ఏ ఆఫీసర్​ని నియమించాలనే విషయంలో ధనుంజయరెడ్డే కీలక పాత్ర పోషించినట్లు సిట్‌ భావిస్తోంది. లిక్కర్ పాలసీ రూపకల్పన, సరఫరాదారుల నుంచి ముడుపులు వసూళ్లు, ఆ సొమ్మును డొల్ల కంపెనీలకు మళ్లించడంలో పాత్ర కూడా ఉందని సిట్ ఇప్పటికే తేల్చిందని సమాచారం. పర్సంటేజ్‌ల గురించి చర్చించేందుకు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి మద్యం కంపెనీ యజమానులతో పలుమార్లు హైదరాబాద్, ఏపీలో మీట్ అయినట్లు, వసూలు చేసిన సొమ్మును షెల్‌ కంపెనీల ద్వారా మళ్లించినట్లు సిట్‌ దర్యాప్తులో ఆధారాలు సేకరించారు.

ఆ సొమ్ము అంతిమంగా ఎవరి ఖాతాకు చేరిందనే దానిని తేల్చేందుకు సిట్ అధికారులు ఫోకస్ పెట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో పాటు ఆయన పీఏ పైలా దిలీప్‌ను ఇప్పటికే సిట్ అరెస్ట్ చేసింది. వారిని కస్టడీలోకి తీసుకుని లిక్కర్‌ స్కాంకు సంబంధించి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. అలాగే ఈ కేసులో మరికొన్ని అరెస్ట్‌లు కూడా జరిగాయి. ఈ కేసుకు సంబంధించి పలువురికి నోటీసులు ఇచ్చిన సిట్ అధికారులు వారిని విచారించారు కూడా.

మొత్తానికి ఏపీ లిక్కర్ స్కాం కేసులో మే 13న ఏం జరగబోతుందన్న ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టులో ముగ్గురు నిందితులు దాఖలు చేసిన పిటిషన్ పై ధర్మాసనం ఎలాంటి తీర్పునిస్తుందో అని ధనుంజయరెడ్డి, క్రిష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలు తెగ టెన్షన్ పడుతున్నారట. ఒకవేళ తమకు వ్యతిరేకంగా తీర్పువస్తే కిం కర్తవ్యం ఏంటన్న భయం వారిలో మొదలైందట.

ఇక అరెస్ట్ కాక తప్పదేమో అన్న చర్చ వారిలో మొదలైందట. అయితే మే 13 సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే ఈ ముగ్గురు భాహ్య ప్రపంచంలోకి వస్తారా అన్న చర్చ కూడా జరుగుతోంది. అప్పటివరకు ఇలా అజ్జాతంలోనే ఉంటారన్న టాక్ విన్పిస్తోంది. ఇదిలా ఉంటే సిట్ మాత్రం…ఈ ముగ్గురిని అరెస్ట్ చేసేందుకు అన్ని వైపులా ముమ్మరంగా గాలిస్తున్నారు. ఏ క్షణంలోనైనా వీరి అరెస్ట్ ఉండొచ్చన్న చర్చ ఏపీ రాజకీయాల్లో జరుగుతోంది.