YSR Congress Party : వైసీపీ తొలి జాబితా విడుదల.. ఏడు కార్పొరేషన్లు, 14 మున్సిపాలిటీలు, ఆరు నగర పంచాయతీలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల వీరే..

YSR Congress Party : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు మేయర్, చైర్మన్ అభ్యర్థులను గురువారం అర్ధరాత్రి ప్రకటించింది.

YSR Congress Party : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ రావడంతో పార్టీల అధిష్టానాలు అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు మేయర్, చైర్మన్ అభ్యర్థులను గురువారం అర్ధరాత్రి ప్రకటించింది. ఏడు కార్పొరేషన్లకు, 14 మున్సిపాలిటీలకు, ఆరు నగర పంచాయతీలకు వైఎస్ఆర్ సీపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.

Also Read : AP Local Body Elections 2026 : జనసేనకు నాలుగు.. బీజేపీకి రెండు కార్పొరేషన్లు.. స్థానిక ఎన్నికల్లో కూటమి సీట్లపై క్లారిటీ.. పార్టీల వారిగా లిస్ట్ ఇదే..

మేయర్ అభ్యర్థుల జాబితా..
♦ విజయనగరం : కొలగట్ల శ్రావణి
♦ విశాఖ : వరుదు కల్యాణి
♦ ఏలూరు : గంటా మోహన్‌రావు (జీఎంఆర్‌)
♦ మచిలీపట్నం : లంకా జ్యోతి
♦ ఒంగోలు : కుప్పం ప్రసాద్‌
♦ నెల్లూరు : ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి
♦ కడప : బండి దీప్తిరెడ్డి

మున్సిపల్ చైర్మన్‌ అభ్యర్థుల జాబితా..
♦ పలాస – తలుసు శ్రీపద్మ
♦ నర్సీపట్నం – చింతకాయల అనిత
♦ యలమంచిలి- బి.తులసి
♦ తుని – పిట్ల రామతులసి
♦ కొవ్వూరు – మన్నె పద్మ,
♦ రామచంద్రపురం – నాగేశ్వరరావు
♦ ఇచ్ఛాపురం – రాజ్యలక్ష్మి,
♦ కొండపల్లి – నల్లమోతు తేజస్వి
♦ తెనాలి – మద్దాలి శేషాచలం,
♦ చీరాల – ఇస్తార్ల శెర్లి
♦ బద్వేల్ – రాచపూడి వెంకటసాయికృష్ణ,
♦ పులివెందుల – వైఎస్ ప్రమీలమ్మ
♦ మదనపల్లె – జింకా చలపతి,
♦ ప్రొద్దుటూరు – పొర్రెడ్డి నరసింహారెడ్డి

నగర పంచాయతీలు..
♦ ఏలేశ్వరం : బదిరెడ్డి ఆశాలత
♦ ఉయ్యూరు : పైడముక్కల దివ్య
♦ గురజాల : పోలూ వీరారెడ్డి
♦ కనిగిరి : పులి శాంతి రెడ్డి
♦ బుచ్చిరెడ్డిపాలెం : షేక్ షకీలా బేగం
♦ కమలాపురం : మార్జుల కవిత