×
Ad

జాబ్‌ క్యాలెండర్‌ గురించి మంత్రి నారా లోకేశ్ గుడ్‌న్యూస్‌.. డీఎస్సీ పోస్టులపై కూడా.. 

కేజీబీవీ పాఠశాలల విద్యార్థుల మార్కుల మెమోలు వ్యాలీడ్ అవుతాయా? అన్న సందేహం చాలామంది తల్లిదండ్రుల్లో ఉందని తెలిపారు. కేజీబీవీ పాఠశాలల విద్యార్థుల మార్కుల మెమోలు వ్యాలీడ్ అవుతాయా? అన్న సందేహం చాలామంది తల్లిదండ్రుల్లో ఉందని తెలిపారు.

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా జాబ్‌ క్యాలెండర్‌ గురించి మంత్రి నారా లోకేశ్ కీలక వివరాలు తెలిపారు. ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, దానిలోనే డీఎస్సీ పోస్టులు కూడా ఉంటాయని లోకేశ్ అన్నారు.

ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ.. ఏపీలోని కేజీబీవీ పాఠశాలల్లో 6, 7, 8, 9, 10 తరగతులతో పాటు ఇంటర్మీడియట్‌ను కూడా రన్ చేస్తున్నామని అన్నారు. 2012లో కేజీబీవీ సొసైటీతో రిక్రూట్ చేశారని చెప్పారు.

కేజీబీవీ పాఠశాలల విద్యార్థుల మార్కుల మెమోలు వ్యాలీడ్ అవుతాయా? అన్న సందేహం చాలామంది తల్లిదండ్రుల్లో ఉందని తెలిపారు. అంకేజీబీవీ పాఠశాలల విద్యార్థుల మార్కుల మెమోలు వ్యాలీడ్ అవుతాయా? అన్న సందేహం చాలామంది తల్లిదండ్రుల్లో ఉందని తెలిపారు.  ఎంటీఎస్ అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఎప్పటిలోగా అమలు చేస్తుందో చెప్పాలని కోరారు.

ఎమ్మెల్యే మురళీ మోహన్ మాట్లాడుతూ.. కేజీబీవీల్లో డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయులను ఎంపిక చేసే అవకాశం ఉంటుందా? అని అడిగారు.

మంత్రి లోకేశ్‌ స్పందిస్తూ.. ఇతర రాష్ట్రాలో కేజీబీవీల్లో కనీసం అడ్మిషన్లు జరగడం లేదని, ఏపీలో ప్రవేశాలకు ఏకంగా పోటీ ఉందని చెప్పారు.
“మనం ఒక నిర్ణయం తీసుకోవాలన్నా, జీతాలు పెంచాలన్నా కేంద్రం కూడా బడ్జెట్ పెంచాలి. కేంద్రంతో ఇదే విషయంపై చర్చించాం. కేంద్రమంత్రి కూడా అంగీకరించారు. కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పి సహకారం అందిస్తే మేము కూడా రన్ చేస్తాం” అని అన్నారు.

ఉన్నత విద్యలో ఇంజనీరింగ్‌తో పాటు పాలిటెక్నిక్, ఐటీఐ కూడా ఎంతో కీలకమని లోకేశ్ అన్నారు. ఉత్తరాంధ్రలో ఎకో సిస్టం ఏర్పడుతుందని, దీంతో ఆయా సంస్థలకు అవసరమైన స్కిల్ సెట్‌ను ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు.

విజయనగరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను రిపైర్ చేయాల్సి ఉందని లోకేశ్ తెలిపారు.