Akshaya Tritiya 2026 : అక్షయ తృతీయ నాటి రాత్రి అరుదైన గ్రహాల కలయిక.. ఈ 4 రాశుల వారి పంట పండింది.. డబ్బే డబ్బు
Akshaya Tritiya 2026 : అక్షయ తృతియ నాటి రాత్రి అరుదైన గ్రహాల కలయిక జరగబోతుంది. దీని వల్ల 4 రాశుల వారికి ఊహించని అదృష్టం. ఇంతకు ఆ రాశులు ఏవంటే..
akshaya-tritiya 2026 rare planetary yoga brings prosperity for these four zodiac signs
Akshaya Tritiya 2026 : అక్షయ తృతీయను హిందువులు అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ రోజు ఏ పని ప్రారంభించినా, కొత్త వస్తువులు కొన్నా, వ్యాపారాలు మొదలుపెట్టినా శుభం కలుగుతుందని అందరి నమ్మకం. మరీ ముఖ్యంగా నేడు బంగారం కొంటే సంపద వృద్ధి చెందుతుందని భావిస్తారు. అందుకు తగ్గట్టుగానే ధర పెరిగినా లెక్క చేయకుండా బంగారం దుకాణాలు వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి. అయితే వాస్తవానికి నేడు బంగారం కొనడం కన్నా.. జలదానం (నీటిని దానం చేయడం) చేస్తే మరింత పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే, ఈ అక్షయ తృతీయ నాడు (ఆదివారం) రాత్రి ఒక అద్భుతమైన గ్రహాల కలయిక జరగబోతోంది. దీనివల్ల ముఖ్యంగా నాలుగు రాశుల వారికి ‘పట్టిందల్లా బంగారమే’ అన్నట్లుగా అదృష్ట లక్ష్మి తలుపు తట్టబోతోంది. ఆ నాలుగు రాశులు ఏమిటో ఇప్పుడు చూద్దాం:
వృషభ రాశి:
అక్షయ తృతీయ రాత్రి సంభవించే అరుదైన గ్రహాల కలయిక వల్ల వృషభ రాశి వారికి అద్భుతమైన కాలం మొదలవుతుంది. వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుందని పండితులు చెబుతున్నారు. వీరి ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. చాలా కాలంగా వసూలు కాని మొండి బాకీలు వసూలు అవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. మానసిక ఒత్తిడి తగ్గి, ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.
సింహ రాశి:
అరుదైన గ్రహాల కలయిక వల్ల సింహ రాశి వారికి విజయాలు వరిస్తాయి. వ్యాపారస్తులు భారీ లాభాలను ఆర్జిస్తారు. ఈ రాశి వారి ప్రతిభకు తగిన గుర్తింపు లభించి, పురస్కారాలు లేదా అవార్డులు అందుకునే అవకాశం ఉంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మరియు కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి.
ధనస్సు రాశి:
అక్షయ తృతీయ నాటి గ్రహాల అనుకూలత వల్ల ధనస్సు రాశి వారికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్థలు తొలగిపోయి దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఈ రాశికి చెందిన విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ర్యాంకులతో ఉత్తీర్ణులవుతారు. ఇంటా బయటా వీరికి గౌరవం, సంతోషం లభిస్తాయి.
మీన రాశి:
గ్రహాల కలయిక వల్ల అద్భుతమైన ఫలితాలను పొందే జాబితాలో మీన రాశి వారు కూడా ఉన్నారు. వీరు ఊహించని ప్రయోజనాలను అందుకుంటారు. ఆర్థికంగా మరియు ఆరోగ్యపరంగా ఈ సమయం వీరికి ఎంతో శుభప్రదం. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. అనారోగ్య బాధలు దూరమై, పూర్తి ఉత్సాహంతో, ఆనందంగా జీవిస్తారని జ్యోతిష్య పండితులు పేర్కొంటున్నారు.
గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడం జరిగింది. 10tv దీన్ని నిర్ధారించడం లేదు.
