Akshaya Tritiya 2026 : అక్షయ తృతియ నాడే అక్షయ యోగం.. ఇక ఆ 4 రాశుల వారి దశ తిరగనుంది.. ప్రమోషన్, అన్నింటా పై చేయి.. డబ్బు సమస్యుల దూరం
Akshaya Tritiya 2026 : ఈ సంవత్సరం అక్షయ తృతియ నాడు అరుదైన అక్షయ యోగం ఏర్పడుతుంది. దీని వల్ల 4 రాశుల వారికి ఊహించని లాభాలు కలగనున్నాయి.
akshaya yoga on akshaya tritiya 2026 these four lucky zodiac signs get prosperity
Akshaya Tritiya 2026 : వైశాఖ మాసానికి హిందూ పురాణాల్లో చాలా ప్రత్యేకత ఉంది. ఈ వైశాఖ మాసంలో వచ్చే పండగల్లో అక్షయ తృతీయ ఒకటి. వైశాఖ మాసంలో శుక్ల పక్షం మూడవ రోజును అక్షయ తృతీయగా జరుపుకుంటారు. అక్షయ తృతీయ నాడు బంగారం, వెండి కొనుగోలు చేస్తే కలిసి వస్తుందని.. చాలా మంది నమ్ముతారు. అప్పు చేసైనా సరే బంగారం కొంటారు. ఇదిలా ఉంటే ఈ సారి అక్షయ తృతీయ నాడు అరుదైన అక్షయ యోగం ఏర్పడుతుంది. దీని వల్ల 4 రాశుల వారి తలరాత మారబోతుందని అంటున్నారు. ఇంతకు ఆ 4 రాశులు ఏవంటే..
మేష రాశి :
అక్షయ తృతీయ నాడు ఏర్పడే అక్షయ యోగం వల్ల విపరీతంగా కలిసి వచ్చే రాశుల్లో మేష రాశి కూడా ఉంది. అక్షయ తృతీయ నుంచి ఈ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుందని.. అక్షయ యోగం వలన వృత్తి, ఉద్యోగాల్లో కలిసి వస్తుందంటున్నారు పండితులు. వీరు ఉన్నతాధికారుల నుంచి మన్ననలు పొందుతారు. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. వీరి జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుందని.. ఇంటా బయట సంతోషకరమైన వాతావరణం నెలకొంటుందంటున్నారు.
తుల రాశి :
అక్షయ తృతీయ నాడు ఏర్పడే అక్షయ యోగం వలన తుల రాశి వారి జాతకమే మారిపోతుంది. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పనుల్లో ఆటంకాలు తొలగిపోయి చాలా ఆనందంగా గడుపుతారు. అన్నింటా అద్భుతమైన ప్రయోజనాలు అందుకుంటారు.
ధనస్సు రాశి :
అక్షయ తృతీయ నుంచి ధనస్సు రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ అక్షయ యోగం ధనస్సు రాశి వారి జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకువస్తుంది. వీరు మొదలు పెట్టిన పనులు.. ఎలాంటి శ్రమ, ఇబ్బంది లేకుండా పూర్తి అవుతాయి. ఇంటాబయటా సానుకూల వాతావరణం ఉంటుంది.
కుంభ రాశి :
కుంభ రాశి వారికి అన్నివిధాలుగా కలిసి రానుంది. చిన్న చిన్న సమస్యలు ఉన్నా అన్నింట్లో ఈ రాశి వారిదే పైచేయి ఉంటుంది. త్వరితగతిన పనులు పూర్తి చేసుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. దీంతో ఈ రాశి వారు బంగారం లేదా వెండి కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం పాఠకుల ఆసక్తిమేరకు ఇవ్వడం జరిగింది. దీన్ని 10tv నిర్ధారించడంలేదు.
